దిలావర్పూర్, సెప్టెంబర్ 4 : మన రాష్ట్ర సంక్షేమ ఫథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మన రాష్ట్రంలో ఉన్న పథకలు అక్కడ అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. నర్సాపూర్(జీ), దిలావర్పూర్లో నూతన పింఛన్ లబ్ధిదారులకు ఆసరా కార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ ఫథకాలను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయ డం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన నుంచి తీసుకునేది కొండంత అని, వారు మనకు తిరిగి ఇచ్చేది గోరంత అని చెప్పారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన 26 రాష్ర్టాల రైతు సంఘాల నేతలు, రైతులను సంఘటితం చేసేందుకు సీఎం కేసీఆర్‌ను నాయకత్వం వహించాలని కోరారని గుర్తు చేశారు. నిర్మల్ నియోజక వర్గంలో 75వేల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు నిర్మల్ జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజ్ తీసుకు వచ్చానని, రూ.166 కోట్లు మంజూరైనట్లుతెలిపారు.
మరో రెండు నెలల్లో నిర్మల్ నియోజక వర్గంలోని 50 వేల ఎకరాలకు ప్యాకేజీ 27 ద్వారా సాగు నీరు అందిస్తామని చెప్పారు. ఈ నెల 17 నుంచి తెలంగాణ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీలు పాల్దే అక్షర,కొండ్రు రేఖ, జడ్పీటీసీలు రామయ్య,రమణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి, మండల అధ్యక్షులు కోడే రాజేశ్వర్, గంగారెడ్డి, కదిలి, కాల్వ ఆలయ చైర్మన్ భుజంగ్‌రావు పటేల్, వైస్ ఎంపీపీ బాబురావు, సర్పంచ్‌లు వీరేశ్ కుమార్, గంగారెడ్డి, తిరుమల, సవిత, నాయకులు పాల్దే అనిల్, కొండ్రు రమేశ్,శ్రీనివాస్, కృష్ణ, ఎంపీడీవో మోహన్, ఎంపీవో జజీజ్ఖాన్, వివిధ శాఖల అధికారులు,నాయకులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయం
సారంగపూర్, సెప్టెంబర్ 4: అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని కౌట్ల (బీ) గ్రామ శివారులోని కరుణాకర్‌రెడ్డి ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రాంరెడ్డి, ఆడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ చందు, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు ఆశ్రితారెడ్డి, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, ఎంపీడీవో సరోజ, తహసీల్దార్ సంతోష్ రెడ్డి, నాయకులు రాజ్‌మహ్మద్, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రి అల్లోలకు ఆహ్వానం
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 4 : జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవానికి రావాలని కోరుతూ డీఈవో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేయనున్నట్ల డీఈవో తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గజేందర్, లక్ష్మణ్, మైస అరవింద్, నరేంద్ర బాబు,రవి తదితరులున్నారు.
పరామర్శ
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మేడారం ప్రదీప్ తల్లి కాలేయ వ్యాధితో బాధపడుతూ పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం ఆమెను పరామర్శించారు.ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆయన వెంట నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డాక్టర్ సుభాష్ రావు, అడ్పపోశెట్టి ఉన్నారు.