ఎదులాపురం, సెప్టెంబర్ 4 : బీజేపీ పాలనతో యువత విసుగు చెంది, టీఆర్ఎస్వైపు మొగ్గుచూపుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా జోగు రామన్న అన్నారు. రాంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు రాహులల్, నీరజ్రెడ్డిలతో పాటు పలువురు యువకులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస్లో చేశారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఎస్ఎన్ఎల్, పోస్టల్, రైల్వేతో పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నదని మండిపడ్డారు.
రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రం ఉన్న ఉద్యోగాలను ఊడతీస్తుండడంతో యువత కేంద్రం తీరుపై విసుగు చెందుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. మతంపేరుతో రాజకీయం చేస్తూ దేశంలో చిచ్చుపెడుతున్నదని ధ్వజమెత్తారు. క్యాంపు కార్యాలయంలో గణపతిని ఎమ్మెల్యే జోగురామన్న దంపతులు పూజించారు. అనంతరం వేలంవేసిన లడ్డూ ప్రసాదాన్ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి రూ.18, 100కు పొందాడు. తరువాత గణనిమజ్జనం చేశారు.
అన్ని కులాలకు ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు ప్రాధాన్యమిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో ఆదివారం పద్మశాలీ సంఘ భవన నిర్మాణ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పద్మశాలీ సంఘ భవనంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి వారికి ఉన్నత కొలువులు వచ్చేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రతి కుల సంఘానికి కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్నను సంఘం నాయకులు సత్కరించారు. కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణ అధ్యక్షుడు అజయ్, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు స్వరూపారాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కౌన్సిలర్ అశోక్ స్వామి, రాంపూర్ మాజీ సర్పంచ్ భోజారెడ్డి, పర్వీన్, పద్మశాలీ సంఘం తాలుకా అధ్యక్షుడు బొమ్మకంటి రమేశ్, ప్రధాన కార్యదర్శి చిలుక విలాస్, గౌరవాధ్యక్షుడు జే సత్యనారాయణ, పోపా సంఘం అధ్యక్షుడు బేత రమేశ్, ప్రధాన కార్యదర్శి మెట్టిపెల్లివార్ శ్రీధర్, ఆత్మ చైర్మన్ జిట్ట రమేశ్, టీఆర్ఎస్ బీసీ సెల్ నాయకులు దాసరి రమేశ్, ఊశన్న పాల్గొన్నారు.