ముథోల్, ఆగస్టు 30 : టీఆర్స్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ వినియోగించుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సూచించారు. మండలంలోని మచ్కల్, రాంటెక్, ముద్గల్ గ్రామాల్లోని పలువురికి నూతన పింఛన్లు మంజూరయ్యాయి. 92 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్ కార్డులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. బంగారు తెలంగాణే లక్ష్యం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ ఆత్మస్వరూప్, ఎంపీడీవో సురేశ్ బాబు, నాయకులు మైసాజీ, రవీందర్ రెడ్డి, ఎర్రం మురళి పాల్గొన్నారు.
పింఛన్ కార్డులు పంపిణీ
భైంసాటౌన్, ఆగస్టు 30: పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. భైంసా మండలంలో 1515 మందికి నూతన పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పిప్పెర కృష్ణ, వైస్ చైర్మన్ ఆసిఫ్, ఎంపీపీ కల్పన జాదవ్, ఎంపీడీవో గంగాధర్, వైస్ ఎంపీపీ గంగాధర్, మండల ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
కుభీర్, ఆగస్టు 30 : మండలంలోని చొండి, పల్సి తాండ, నిగ్వ, కుప్టి, గోడాపూర్, డోడర్న, చాత, సిర్పెల్లి (హెచ్) తదితర గ్రామాలకు చెందిన పలువురు అత్యవసర సమయాల్లో ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించకున్నారు. వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరైంది. రూ. 4.70 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మంగళవారం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ తూంలక్ష్మి , టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు దత్తహరి, నిగ్వ ఎంపీటీసీ దొంతుల దేవీదాస్, గుంచెటి రాజు, దత్తు పటేల్ పాల్గొన్నారు.