నిర్మల్ అర్బన్, ఆగస్టు 30 : క్రీడలతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొనిని పట్టణంలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో మంగళవారం ఖేల్ కీ జోష్ కార్యక్రమాన్ని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ క్రీడా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం విద్యార్థులకు వాలీబాల్, టేబుల్ టెన్నీస్, ఫుట్‌బాల్, ఖోఖో, త్రోబాల్, ఇతర క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
మట్టి వినాయకుల పంపిణీ
అల్ఫోర్స్ – టెక్నోపాఠశాలలో మంగళవారం ముందస్తు పర్యావరణ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణానికి మేలు చేసే మట్టివినాయకులను విద్యార్థులతో తయారు చేయించి వాటిని పంపిణీ చేశారు. పండుగ రోజున వాటిని తమ ఇళ్లల్లో ప్రతిష్టించి పూజలు చేస్తామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల ముందు చూపును చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు.