ఎదులాపురం, ఆగస్టు 26: రిమ్స్ సూపర్‌స్పెషాలిటీ దవాఖానలో ఐపీ(ఇన్ పేషెంట్) వైద్య సేవలు త్వరలోనే ప్రారంభిస్తామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. శుక్రవారం రిమ్స్ సూపర్‌స్పెషాలిటీ దవాఖానను సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, ఇతర విభాగల హెచ్‌వోడీలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జైసింగ్ మాట్లాడుతూ అతిత్వరలోనే యూరాలజీ, పీడియాట్రిక్ సర్జన్, ఆప్తమాలజీ, ఈఎన్టీ, మోకాళ్ల కీళ్ల మార్పిడి సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఇక్కడ వైద్యులు ఇద్రీస్అక్బానీ, చంపత్రావు, దేవీదాస్, కాంట్రాక్ట్ సూపర్వైజర్ అనుదీప్ తదితరులు ఉన్నారు.
రిమ్స్‌లో ఉచిత కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు సక్సెస్ అవుతున్నాయని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. దవాఖానలో నేరడిగొండ మండలం బోరిగాంకు చెందిన కళాబాయి, తలమడుగు మండలం బరంపూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి ఐదు రోజుల క్రితం కీళ్లనొప్పులతో చేరగా శుక్రవారం వైద్య బృందం శస్త్ర చికిత్స చేశారు.
ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు. గత నెలలో ఒకటి, ఈ నెలలో రెండు శస్త్ర చికిత్సలు చేశామన్నారు. కీళ్ల నొప్పులున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్యబృందాన్ని డైరెక్టర్, సూపరింటెండెంట్ అశోక్ తదితరులు అభినందించారు. ఇక్కడ వైద్యులు శ్యామ్ ప్రసాద్, నాగేశ్వరావు, నవీన్, అవినాశ్‌రెడ్డి, అనస్తీషియా స్పెషలిస్ట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఓటీ సిబ్బంది తదితరులు ఉన్నారు.