పెంబి, ఆగస్టు 26: గిరిజన గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా నాయక్ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డితో మండలంలోని గిరిజన గ్రామాలైన వేణునగర్, పెంబి తండా, కోశగుట్ట, తాటిగూడ గ్రామాల్లో పర్యటించారు. వేణునగర్‌లో కొలాం సంఘ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం పెంబి తండాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
గిరిజన గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు ఐటీడీఏ నుంచి నిధులు మంజూరు చేయాలని పీవోను ఆదేశించారు. 3 ఫేజ్ విద్యుత్ అందించాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని రైతులు పీవోను కోరారు. పీవో మాట్లాడుతూ జిల్లాలో 36 గ్రామాలకు 3 ఫేజ్ విద్యుత్ లేదని, ప్రతి గ్రామానికి త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
పోడుభూములకు పట్టాల విషయం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉందన్నారు. ఆదివాసీ కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా కోళ్లు, గిరివికాస్ ద్వారా బోర్లు, సోలార్లు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో లింబాద్రి, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సల్ల నరేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ భూక్యా టీకాజీ, సర్పంచులు పూర్ణచందర్‌గౌడ్, కున్సోత్ కరుణావిలాస్, సుధాకర్, ఆత్రం రాధ, టేకం రాజు, ఎంపీటీసీ రామారావు, ఎంపీవో చిక్యాల రత్నాకర్‌రావు, నాయకులు బానావత్ సురేశ్, గాండ్ల శంకర్, రమేశ్ పాల్గొన్నారు.