తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియను నిర్మల్ జిల్లాలో అధికారులు పూర్తి చేశారు. వీడియో చిత్రీకరణలో లాటరీ పద్ధతిన కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రక్రియ చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 96 మంది వీఆర్వోలు పని చేస్తుండగా.. వీరందరినీ వివిధ ప్రభుత్వ శాఖల్లో గుర్తించిన ఖాళీలు, రద్దయిన పోస్టుల్లో సర్దుబాటు చేశారు. అధికంగా విద్య, పంచాయతీరాజ్ శాఖలకే కేటాయింపులు జరిపారు. వీరు వెంటనే జాయినింగ్ రిపోర్ట్లు సమర్పించాల్సి ఉంటుంది.
నిర్మల్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : రెవెన్యూ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం 2020 సెప్టెంబర్లో రద్దు చేసింది. తర్వాత అక్టోబర్లో శాసనసభలో కొత్త రెవెన్యూ, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించింది. వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని అప్పట్లోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటినుంచి వీఆర్వోలు భూ సంబంధిత విధులకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తమకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ మినహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు కలెక్టర్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
నిర్మల్ జిల్లాలో 96 మంది సర్దుబాటు ..
కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు రాం బాబు, హేమంత్ బోర్కడే ఆధ్వర్యంలో అధికారు ల సమక్షంలో సోమవారం వీఆర్వోల సర్దుబాటును పూర్తి చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నంబర్.121 అనుసరించి కేటాయిం చారు. అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖలో 36 మం ది, ఉన్నత విద్యలో 22 మందిని సర్దుబాటు చేశారు.
వివిధ శాఖల్లో కేటాయింపులు ఇలా…
వ్యవసాయ, సహకార శాఖలో ముగ్గురు, పశుసంవర్ధక శాఖలో ఇద్దరిని సర్దుబాటు చేశారు. వెనుకబడిన తరగతులు శాఖలో ఇద్దరు , అటవీ శాఖ లో ముగ్గురు, ఫైనాన్స్ ఇద్దరు, ఐఅండ్పీఆర్ ఒక రు, వైద్యాశాఖ ఒకరు, ఉన్నత విద్య 22, హోం శాఖ నలుగురు, పరిశ్రమలు ఒకరు, ఇరిగేషన్ ఆ రుగురు, మైనార్టీశాఖలో ఒకరు, మున్సిపల్ ఏడుగురు, పంచాయతీరాజ్ శాఖలో 36, సెకం డరీ ఎడ్యుకేషన్ ఒకరు, ఆర్అండ్బీ రవాణా ఇద్దరు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఇద్దరు చొప్పు న సర్దుబాటు చేశారు.