భైంసా, జూలై 24 : రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు పుర స్కరించుకొని భైంసాలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి రోగుల కు పండ్లను పంపిణీ చేశారు. కేటీఆర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళీ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, తోట రాము, మంత్రి భోజారాం, సూరి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
నిర్మల్‌లో..
నిర్మల్ అర్బన్, జూలై 24: మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్మల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము ఆధ్వర్యంలో జరిగాయి. ప్రభుత్వ దవాఖానలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. వృద్ధ్దాశ్రమంలో అన్నదానం నిర్వహిం చారు. దేవరకోట చైర్మన్ లింగంపెల్లి లక్ష్మీనారా యణ, కుర్ర నరేశ్, ధర్మాజీ శ్రీనివాస్, కొప్పుల శ్రీధర్, దేవర రాఘవేందర్, దీకొండ పద్మనా భం, నెల్ల అనిల్ కుమార్, పూసపత్రి రవి, గొను గోపుల నర్సయ్య, రమేశ్, లింగన్న, దశరథ్, గోనె రాజు, ఆకాశ్‌సింగ్, అడుముల్ల విశాల్, హరీశ్, జుబేర్, షాహిజ్, మజార్, టీఆర్ఎస్ కార్యకర్తలు ఐకేఆర్ అభిమానులు పాల్గొన్నారు.
ఖానాపూర్‌లో..
ఖానాపూర్ టౌన్, జూలై 24 : ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో కేటీఆర్ బర్త్‌డే సంబురాలను ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో పార్టీ కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. దవాఖానలో చికిత్స పొందు తున్న వారికి పండ్లను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ రాజేందర్, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీ సీ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కడెంలో..
కడెం, జూలై 24 : టీఆర్ఎస్ నాయకులు కడెం హరిత రిసార్ట్‌లో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మల్లారె డ్డి, ఆత్మ చైర్మన్ కానూరి సతీశ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, మండ ల కోఆర్డినేటర్ కుమ్మరి రంజిత్, సర్పంచ్‌లు అనూష, ఆకుల బాలవ్వ, నాయకులు ఆజాం, ఎస్కే హైమద్, మహమూద్, కే రవి, ఎండీ షర్పొ ద్దీన్, గట్ల నల్లగొండ, తిరుపతి, కలీం, రవి, వెంక టేశం, ముత్తన్న, నేరేళ్ల నరేశ్, తదితరులున్నారు.
దస్తురాబాద్‌లో..
దస్తురాబాద్, జూలై 24 : మండల కేంద్రంలో ని రైతు వేదిక ఆవరణలో ప్రజాప్రతినిధులు, నాయకులు మొక్కలు నాటారు. రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సిర్ప సంతోష్, టీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి అర్గుల రాజ నర్స య్య, నాయకులు నిమ్మతోట శివయ్య, చెవుల మద్ది నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
జాంగాంలో..
కుభీర్, జూలై 24 : మండలంలోని జాంగాం గ్రామంలో టీఆర్ఎస్ యువ నాయకులు మొక్క లు నాటారు. సమర్థ నాయకుడు కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ముజాహిద్ఖాన్, ఉప సర్పంచ్ గణేశ్, మాజీ ఉప సర్పంచ్ మాన్కూర్ సంజీవ్, జిడ్డు గంగరాజు, యువకులు పాల్గొన్నారు.
బాసరలో ప్రత్యేక పూజలు
బాసర, జూలై 24 : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బాసర అమ్మ వారి ఆలయంలో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారిని దర్శించు కొని మంత్రి కేటీఆర్ పేరుపై అర్చకులతో ప్రత్యేక పూజలు చేయించారు. కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అమ్మ వారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా యాచకులు, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.