నెన్నెల,జూలై 23 : తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్ని లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం కక్ష పూ రిత పనులు చేపడుతున్నదని క్షేత్రస్థాయిలో జరిగే పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా వ్యవహరించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య సూచించారు. శనివారం జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో ఆయన ఉపాధి హామీ పథకం పై చర్చలో భాగంగా మాట్లాడారు. ఈజీఎస్ పనుల్లో చిన్నచిన్న తప్పిదాలను ఎత్తి చూపి పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలనే ధోరణిలో కేంద్ర ప్ర భుత్వం ఉందని ఆరోపించారు. ఇటీవల గ్రామాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తూ పథకం అమలు తీరు ను పరిశీలిస్తున్నారని, కానీ వారు పథకం అమలు సక్రమంగా జరగడంలేదని నివేదిక ఇవ్వడానికేనని అన్నారు. పశ్చిమ బెంగాల్లో కుంటి సాకులు చూపించి పథకం లేకుండా చేశారని మండిపడ్డారు.
వేలాది మంది కూలీలు దీనిపై ఆధారపడి ఉన్నార ని, పనుల్లో అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజమన్నారు. వాటిపై కూడా ఎప్పటికప్పుడు ప్రజావేదికలు నిర్వహించి సామాజిక తనిఖీలు చేస్తున్నారన్నారు. వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేయాలని సూచించా రు. రో డ్లు, చెరువులు, కుంటలు తెగిపోతే వాటిపై తక్షణమే సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆయల్పాం సాగు చేసే రైతులను గుర్తించి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీపై అవగాహన కల్పించాలన్నారు. మండలంలో 8051 మంది రైతులకు ఐదేండ్లలో రూ. 100 కోట్లను రైతుబంధు కింద అందించినట్లు ఏవో పేర్కొన్నారు. అ లాగే రూ. 5 కోట్ల రైతుబీమా పథ కం కింద అందించినట్లు చెప్పారు. మండల వ్యా ప్తంగా హరితహారంలో మొక్కలు నాటాలని ఎమ్మె ల్యే సూచించా రు. జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ సంతోషం రమాదేవి, జడ్పీటీసీ సింగతి శ్యామల , ఎంపీడీవో వరలక్ష్మి, తహసీల్దార్ భూమేశ్వర్ , ఎంపీటీసీలు, తిరుపతి, సుమలత, కమల, హరీశ్, రమేశ్, కోఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, సర్పంచ్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.