దిలావర్పూర్, జూలై 22: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో పంటలు, రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని వాటికి నిధులు మంజూరు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తున్నదని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం దిలావర్పూర్ నుంచి గుండంపల్లికి వెళ్లే బీటీ రోడ్డు ను, పంటలను మంత్రి పరిశీలించారు. అనంతరం కస్తూర్బాగాంధీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వరదలు వచ్చి నష్టపోతే, కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకుండా కుట్ర చేసున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వరదలు వస్తే రాత్రికి రాత్రే నిధులు మంజూరు చేస్తున్నదని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర సర్కారుదేనని తెలిపారు. పాలు, పాల ఉత్పత్తులపై వస్తుసేవల పన్నులు విధించడం సిగ్గు చేటన్నారు. తక్షణమే జీవోను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. కోతకు గురైన రోడ్లకు కావాల్సిన నిధులను ముఖ్యమంత్రితో మాట్లాడి మంజూరు చేయిస్తానని తెలిపారు.
విద్యార్థినులకు నాణ్యమైన విద్యనందించాలి
కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలను సందర్శించడానికి వచ్చిన మంత్రికి ప్రిన్సిపాల్ అపర్ణ పాఠశాల భవన పరిస్థితుల గురించి వివరించడంతోపాటు, విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు లేవని చెప్పడంతో తక్షణమే స్పందించి సంబంధిత అధికారులను పిలిచి భవన నిర్మాణ పనుల కోసం అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో బెంచీలు అందిస్తామని చెప్పారు.
అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ పాల్దె అక్షర-అనిల్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కోడె రాజేశ్వర్, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, నిర్మల్ రైతు సేవా సహకార సంఘం ఉపాధ్యక్షుడు దుప్పి సాయన్న, మండల ఉపాధ్యక్షుడు బాబురావు, సర్పంచులు గంగారెడ్డి, ఆడెపు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల నాయకులు ధనే రవి, ధనే నర్సయ్య, పాల్దె అనిల్, పాల్దె శ్రీనివాస్, ఒడ్నం కృష్ణ, గుణవంత్‌రావు, తహసీల్దార్ కరీం, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్‌ఖాన్, ఏవో స్రవంతి, ఏఈ శ్రీనివాస్, పీఆర్ ఏఈ శివకృష్ణ తదితరులున్నారు.
ప్రకృతి కన్నెర్రతోనే భారీ వర్షాలు
సారంగాపూర్, జూలై 22: ప్రకృతి కన్నెర్రతోనే అధిక వర్షాలు కురిశాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సోనాపూర్తండాలో 138 ఆవులు వరదతాకిడికి కొట్టుకుపోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జామ్, యాకర్‌పల్లి, సారంగాపూర్, వంజర్ గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులను పరిశీలించారు. ఇక్కడ ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ నల్ల వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్‌రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఆయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, సర్పంచులు రామారావు, రమణ, లస్మయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్ యాదవ్, నాయకులు రాజ్‌మహ్మద్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, కండెల భోజన్న, నర్సారెడ్డి, రాజేశ్వర్‌రావు, గంగారెడ్డి, మాణిక్‌రెడ్డి, రాంరెడ్డి, తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, ఏవో రాజశేఖర్‌రెడ్డి, పశువైద్యాధికారి ముక్తార్ పాల్గొన్నారు.
చూసిపోవడమే కానీ నిధులివ్వడంలేదు..
సోన్, జూలై 22: కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి వరద నష్టాన్ని చూసిపోతున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వడంలేదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శుక్రవారం సోన్‌లో వరద తాకిడికి గురైన ఇండ్ల బాధితులను పరామర్శించారు. అనంతరం దెబ్బతిన్న పంటలను పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో సోన్ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మొహినొద్దీన్, సోన్, కూచన్‌పెల్లి సర్పంచులు టీ వినోద్, ఇందూరి రాజేందర్, నాయకులు దాసరి శ్రీనివాస్, దాసరి రాజేశ్వర్, జగన్, రాము, బండి లింగన్న, అర్జున్ లింగన్న, రైతులు ఉన్నారు.