ముథోల్, జూలై, 22 కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిత్యావసర సరుకులపై పెంచిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ముథోల్‌లోని నయాబాది చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఆదేసానుసారం టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, తహసీల్దార్ శ్యాంసుందర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అఫ్రోజ్‌ఖాన్ మాట్లాడుతూ పెంచిన జీఎస్టీని రద్దు చేయకపోతే నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్, నాయకులు మురళి, నగేశ్ పటేల్, కదం సంతోష్, శ్రీనివాస్‌గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు మగ్దూమ్, సుధాకర్ పాల్గొన్నారు.
పాల ఉత్పత్తులపై జీఎస్తీ ఎత్తి వేయాలి
గుడిహత్నూర్, జూలై 22: పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తి వేయకుంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతం చేస్తామని పార్టీ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ హెచ్చరించారు. కేంద్రం నిత్యావసర వస్తువులపై పెంచిన జీఎస్టీకి నిరసనగా శుక్రవారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఇక్కడ మాజీ ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఎస్కే జమీర్, ఎంపీటీసీ శగీర్ఖాన్, నాయకులు కుడ్మెత జంగు, కొల్లూరి వినోద్, ఎల్ రాజేశ్వర్, సంతోష్‌గౌడ్, పాటిల్ రాందాస్, రంగు శ్రీనివాస్ గౌడ్, ప్రకాశ్, సిద్ధార్థ్, ప్రతాప్ ఉన్నారు.