ఉట్నూర్, జూలై 22 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రవాణ వ్యవస్థతో పాటు పంటలకు అపార నష్టం వాటిల్లిందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కేంద్రబృందం అధికారులు హోం ఎఫైర్స్ సెక్రెటరీ సౌరవ్‌రాయ్, దిలీప్ శేఖర్, కృష్ణ ప్ర సాద్ తో కలిసి మండలంలో శుక్రవారం పర్యటించారు. ముం దుగా దంతన్‌పల్లి వంతెన, పంటలను పరిశీలించారు. అనంతరం కొమురం భీం ప్రాంగణంలో జిల్లాలోని వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, పంటలకు సంబంధించిన ఫొటోల ఎగ్జి బిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రిజ్వా న్ భాషా భారీ వర్షాలకు 364 గ్రామాల్లో లక్షా 3 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రూ. 73 కోట్ల నష్టం జరిగిందన్నారు.
42 ఆర్అండ్బీ రోడ్లకు గాను రూ. 226 కోట్లు, 389 పం చా యతీ రోడ్లకు రూ. 102 కోట్లు, నీటి పారుదల శా ఖ 55 ట్యాం కులు, కెనాల్లకు రూ. 205 కోట్లు, 440 విద్యుత్ స్తం భాలు, సబ్‌స్టేషన్, ఇతరాత్ర మరమ్మతుకు రూ. 65 లక్షలు, 81 మిషన్ భగీరథ పైపుల మరమ్మతులకు రూ. 40 లక్షలు, 46 గ్రామాల్లో 223 పాక్షికంగా, 45 పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 13 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలో కూడా నష్టం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నటరాజ్, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేశ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ఈ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తం, ఇతర అధికారులు ఉన్నారు
కడెం వంతెన పరిశీలన
కడెం, జూలై 22: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వంతెనలు, రోడ్లు, చెరువులు, నీట మునిగిన పంటలకు సంబంధించిన నష్టం వివరాలను కేంద్ర బృందానికి వివరించినట్లు కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ తెలిపారు. శుక్రవారం కడెం వంతెనతో పాటు, పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ జిల్లాలో 25 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా రూ. 19.76 కోట్లు నష్టం జరిగిందన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని, 732 చెరువులు దెబ్బతిన్నాయని,ఆర్అండ్బీ ద్వారా 4 వంతెనలు, 11 చోట్ల రోడ్లు తెగిపోయాయని, 141 కి.మీ. వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయని కలెక్టర్ వివరించారు. పీఆర్ రోడ్ల 69 రోడ్లకు రూ. 30 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసి కేంద్ర బృందానికి వివరించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, ఆర్డీవో తుకారాం, సంబంధిత అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
నేరడిగొండ మండలంలో..
నేరడిగొండ, జూలై 22 : మండలంలోని కడెం నదీ పరీవాహక వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం కేంద్రం బృందం, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి పరిశీలించింది. కుమారి, కుప్టి, వాగ్దారి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో పంటలకు పరిశీలించారు. ఏయే పంటలు నష్టపోయాయని అడిగి తెలుసుకున్నారు. ఇందులో బృందం సభ్యులు సౌరవ్‌రాయ్, దీప్‌శేఖర్ సింఘాల్, కృష్ణ ప్రసాద్, జేడీఏ పుల్లయ్య, తహసీల్దార్ పవన్‌చంద్ర, ఏవో భాస్కర్, గిర్దావర్ నాగోరావ్, రైతులు ఉన్నారు.