నిర్మల్ టౌన్, జూలై 9 : కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం వేస్తూ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతున్నదని, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించే సమ యం ఆసన్నమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్‌లో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మ హిళా సభ్యులు పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ప్ల కార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన త ర్వాత ఇప్పటివరకు తొమ్మిది సార్లు గ్యాస్ ధరలను పెం చిందన్నారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ పేద ప్రజలపై పన్నుల భారాన్ని వేస్తోందని ఆరోపించారు. నిత్యావసర ధరలు రెట్టింపయ్యాయని, నిరుద్యోగం పెరిగిపోతోందన్నారు.
పెంచిన ధరలను తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు ఇటీవల అమర్నాథ్ యాత్రకు వెళ్లిన 14 మంది యాత్రికులు కొండచరియలు విరిగిపడి చనిపోవడంతో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వారికి ఆత్మశాంతి కలుగాలని వేడుకున్నారు. నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన డాక్టర్ దేవేందర్‌రెడ్డి, పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన డీఈవో రవీందర్‌రెడ్డిని సన్మానించారు. అనంతరం ఎజెండాలోని అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. జిల్లాలో మిషన్‌భగీరథ ద్వారా సీఎం కేసీఆర్ ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని ఇవ్వాలనే సంకల్పంతో పనులు పూర్తి చేస్తే అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చాలా గ్రామాలకు నీరు అందడం లేదని, దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. పదిహేను రోజుల్లో జిల్లాస్థాయిలో సమావేశం నిర్వహించి ప్రతి ఇంటికి నీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్య, వైద్యం, సాగునీటి శాఖల పనితీరుపై మంత్రి సభ్యులకు వివరించారు. ఖా ళీగా ఉన్న ఉపాధ్యాయులను భర్తీ చేసేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, వైస్ చైర్మన్ సాగరబాయి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.