దస్తురాబాద్/భైంసా/ లోకేశ్వరం, జూలై 3 : గ్రా మాల్లో ఆదివారం బో నాల సందడి కనిపించింది. దస్తురాబాద్ మండల కేంద్రంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మకు బోనాలు సమర్పించారు. డప్పుచప్పుళ్లతో బోనాలను నెత్తిన ఎత్తుకొని కాలినడకన పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు, ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం తాతాయిలకు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు బాగా కురువాలని, పంటలు సమృద్ధిగా పం డాలని,పిల్లాపాపలను సల్లంగా చూడాలని వేడుకున్నారు. మేకలు, కోళ్లను బలిచ్చారు. భైంసా పట్టణంలోని మహాలక్ష్మీ ఆలయంలో మహిళలు పెద్దఎత్తున పూజలు నిర్వహించారు. కిసాన్గల్లీలో ఐదు చేతుల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కిసాన్ గల్లీ సర్పంచ్ అల్లకొండ సాయినాథ్, ఉప సర్పంచ్ చిన్నగట్టు, కోశాధికారి కాశీనాథ్, సభ్యు లు సందుల సాయినాథ్, సాయినాథ్, అల్లకొండ రాజేశ్వర్, అల్లకొండ కిషన్ పాల్గొన్నారు. లోకేశ్వ రం మండలకేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలైన పోచమ్మ, మైసమ్మ, అడెల్లమ్మ, ఊరడమ్మ, ఈదమ్మ దేవతలకు భక్తిశ్రద్ధలతో ఘనంగా నివేదించారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగను గాండ్ల తెలికుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం నుంచి హమాలీవాడ కట్ట పోచమ్మ ఆలయం వరకు పుర వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి భక్తులు మొక్కులు చెల్లించారు. డప్పు చప్పుళ్ల మధ్య పోతురాజు విన్యాసాలు, గాండ్ల కుల మహిళలు, కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు, మహిళా నాయకురాలు అత్తి సరోజ, టీబీజీకేఎస్ చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ నల్ల శంకర్, విశ్వనాథ ఆలయ ధర్మకర్త రీనారాణి దాస్ ధర్మేందర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల గాండ్ల తెలికుల సంఘం జిల్లా అధ్యక్షుడు లెక్కల విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గాండ్ల హరి ప్రసాద్, కోశాధికారి జక్కం పూర్ణచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెన్నంపల్లి మురళి, ఉపాధ్యక్షుడు గుజ్జేటి రాజీర్, మహిళా అధ్యక్షురాలు సంగెం రమ్య, గౌరవ అధ్యక్షురాలు కోసరి జయ, పెద్దపెల్లి మహిళా అధ్యక్షురాలు వెన్నపల్లి లక్ష్మి, నాయకులు, గాండ్ల కులస్తులు పాల్గొన్నారు.
హాజీపూర్ మండలంలో..
మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో గత సంవత్సరం పునఃప్రతిష్టాపించిన నల్ల పోచమ్మకు ఆషాడమాసాన్ని పురస్కరించుకొని బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలోసర్పంచ్ ఓలపు శారదా రమేశ్, ఎంపీటీసీ డేగ బాపు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులున్నారు.