దండేపల్లి, జూన్18: పేదింటి ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. దండేపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 110 మంది లబ్ధిదారులకు శనివారం కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో ఆదర్శనీయమైన పథకాలను అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని కొనియాడారు.
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. శనివారం దండేపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 110 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన యువతులు తల్లిదండ్రులకు భారం కాకుడదనే ఉద్దేశ్యంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాలు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంలో దేశాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.
రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ సరఫరా మరే రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం సంక్షేమ పథకాలేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, తహసీల్దార్ హన్మంతరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.