ఇచ్చోడ, జూన్ 18: ప్రణాళికాతో చదివితే అనుకున్న విజయం సాధించడం సులభమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. ఇచ్చోడలో గిరిజన యూత్ ట్రైనింగ్ కేంద్రంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ఉద్యోగార్థుల ఉచిత శిక్షణలో అభ్యర్థులకు శనివారం స్టడీ మెటీరియల్ అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చౌహాన్ సునీత, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, ఏపీవో ఆత్రం భాస్కర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్టారెడ్డి, నాయకులు రాథోడ్ ప్రకాశ్, వెంకటేశ్, గైక్వాడ్ గణేశ్, గోనే లక్ష్మి, రామేశ్వర్, దాసరి భాస్కర్, ముస్తాఫా పాల్గొన్నారు.
పల్లె ప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి
పల్లె ప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని వర్తమన్నూర్ గ్రామంలో పల్లెప్రగతి పనులను ఆయన పరిశీలించారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ నారమ్మ, టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.