
భీంపూర్, ఆగస్టు 17 : అన్ని శాఖల సమన్వయంతో మరింత ప్రగతి సాధించాలని ఎంపీపీ రత్నప్రభ పేర్కొన్నారు. స్థానిక రైతువేదిక భవనంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన భీం పూర్ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పశువైద్యాధికారి సుభా ష్ మాట్లాడుతూ.. రైతులు గడ్డి పెంపకం చేపట్టాలని, విత్తనాలు అందజేస్తామని తెలిపారు. మేకలు, గొర్రెలకు విధిగా నట్టల నివారణ మందు వేయించాలని సూచించారు. పీహెచ్సీ పరిధిలో ఇప్పటివరకు 3,200 మందికి కరోనా వ్యాక్సిన్ వేశామని సూపర్వైజర్ గంగాధర్ తెలిపారు. మండలంలో 31,555 ఎకరాల్లో పంటల సాగు ఉన్నదని ఏఈవో శంకర్ అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన విద్యుత్ పనుల్లో జా ప్యం చేయవద్దని నిపాని సర్పంచ్ భూమన్న కోరారు.
అటవీ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎఫ్ఎస్వో గులాబ్ కోరారు. సమావేశానికి పలు శాఖల అధికారులు రాకపోవడంపై ఎం పీటీసీలు, సర్పంచ్లు ఆవేదన వ్యక్తం జేశారు. ఈజీఎస్ టీఏల తీరు సరిగా లేదని, ప్రగతి పనుల బిల్లులకు జాప్యం చేస్తున్నారని సభ్యులు ఎంపీపీకి ఫిర్యాదు చేశారు. సమావేశంలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, సర్పంచ్లు మడావి లింబాజీ, కల్యాణి, అజయ్, కృష్ణ, చిన్ను, భూమన్న, తహసీల్దార్ సోము, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో సంగీత, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.