నిర్మల్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): నిర్మల్‌లోని ప్రసిద్ధి చెందిన గండి రామన్న క్షేత్రంలో కొలువు దీరిన సాయిబాబా ఆలయం వేడుకలకు ముస్తాబైంది. ఇక్కడి ఆలయంలో గల దేవతా మూర్తుల విగ్రహాల పున: ప్రతిష్ఠాప నోత్సవ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు అంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 19 నుండి 23 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఎంతో ప్రాశస్త్యం గల ఇక్కడి ఆలయాన్ని ఇటీవలే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆలయాభివృద్ధికి అధిక ప్రాధాన్యతఇచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కోటీ 75లక్షల నిధులను మంజూరు చేయించడంతో ఇక్కడి ఆలయ రూపురేఖలే మారి పోయాయి. ఆలయ ట్రస్టీ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి ఆద్వర్యంలో ఈ నిధులను ఒక క్రమ పద్ధ్దతిలో వినియోగిస్తూ భక్తులకు అవసర మైన అన్ని సదుపాయాలను కల్పించారు.
ముం దుగా సువిశాలమైన ఆలయ ఆవరణలో ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టారు. వాహన పూజల కోసం భారీ షెడ్డు, కార్యాలయ భవనం, కల్యాణ మండ పం, మురుగు నీటి వ్యవస్థ, ఫ్లోరింగ్, పచ్చదనం, విద్యుద్ధీకరణ మొదలగు వాటికి ఈ నిధులను వెచ్చించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను పున: ప్రతిష్ట చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ విగ్రహాలకు అవస రమైన ఖర్చులను భరించేందుకు ఆలయ కమిటీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి ముందుకొచ్చారు. ఇటీవలే రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి రూ.8 లక్షలు వెచ్చించి ఐదున్న అడుగుల సాయిబాబా విగ్రహం, రెండున్నర అడుగులు గల దత్తాత్రే యుని విగ్రహాలను తెప్పించారు. ఇప్పటికే ఇక్కడి ఆలయ రూపురేఖలు పూర్తిగా షిరిడీ తరహా ఆల యాన్ని పోలినట్లే నిర్మించగా… ఇప్పుడు షిరిడీలో ఉన్నట్లుగానే సాయినాథుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు.
రూ. కోటీతో ఆలయాల నిర్మాణం…
సాయిబాబా ఆలయ ట్రస్టీ చైర్మన్ జగన్మో హన్ రెడ్డి… తన తల్లిదండ్రులు కృష్ణవేణి, రాంరెడ్డి జ్ఞాపకార్థం ఇక్కడి ఆలయ ప్రాంగణంలో దాదాపు రూ. కోటీ వరకు సొంత నిధులను వెచ్చించి పలు ఆలయాలను నిర్మించారు. శివాలయం, దక్షిణా భిముఖ: ఆంజ నేయ, నందదీప్, షిరిడీ తరహా గురు స్థాన్, ద్వారకా మా యి, చావడి తదితర ఆలయాల నిరాణం చేపట్టారు. ఇటీవలే గండి రామన్న గుట్ట పై గ్రీనరీ, వాటర్ ఫౌంటెయిన్స్, భక్తులు సేద దీరేందుకు పగోడా మొదలగు ఏర్పాట్లు చేయడంతో గండిరామన్న క్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజి ల్లుతున్నది.
నేటి నుంచి ఉత్సవాలు..
సాయబాబా, దత్తాత్రేయ విగ్రహాల పున: ప్రతిష్ట ఉత్సవాలు ఆదివారం నుంచి 5 రోజుల పాటు జరుగనున్నాయి. ఆదివారం ఉదయం 7.25 గంటలకు పట్టణంలోని చింతకుంటవాడ హనుమాన్ ఆలయం నుంచిగండిరామన్న క్షేత్రం వరకు కొత్తగా ప్రతిష్ఠించే విగ్రహాల ఊరేగింపు జరుగుతుంది. ఇందులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొంటారు. ఈ నెల 20న రెండో రోజు మహా గణపతి పూజ, రుద్రహావనం, దత్తాత్రేయ, సాయినాథ మంత్ర హవనం మొదలగు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 21న ఉదయం 8 గంటల నుంచి స్థాపిత దేవతాపూజ, దత్తహావనం, గణపతి హవనం, 22న గణపతి పూజ, పుణ్యా హవచనం, గాయిత్రీ హవనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ తదితర పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. చివరి రోజు 23న ఉదయం 3.25 గంటలకు యంత్ర స్థాపన, విగ్రహ ప్రతిష్ఠాపన, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్ర మాలు ఉంటాయి.