నిర్మల్ టౌన్, జూన్ 18 : తెలంగాణ ప్రభు త్వం పత్తి పంటను ప్రోత్సాహించేందుకు వాన కాలం సీజన్ నుంచే కొత్త పత్తి వంగడాల సాగుకు శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 4.20లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా.. ఇందులో ప్రధానంగా పత్తి పంటనే లక్ష 80వేల ఎకరాల వరకు ఉంటుందని వ్యవసా యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు బీటీ-2 విత్తనాలను ఐదేళ్ల నుంచి సాగు చేస్తు న్నారు. పంట కాలం 160-180 రోజుల వరకు ఉండడంతో పంట దిగుబడి వచ్చే వరకు ఖర్చులు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఈసారి పత్తి రైతుల ను ప్రోత్సహించేందుకు హెచ్డీ (అధిక సాంద్రత) పత్తి విత్తనాలను అందుబాటులోకి తెచ్చింది. నిర్మల్ జిల్లాలో ప్రధానంగా ముథోల్ నియోజక వర్గంలోని ఏడు మండలాలతో పాటు సారంగా పూర్, దిలావర్పూర్, నర్సాపూర్, మామ డ, తదితర మండలాల్లో పత్తి సాగు అధికంగా సాగు చేస్తారు.
హైడ్రేషన్ సాగుతో లాభాలెన్నో..
నిర్మల్ జిల్లాలో వానకాలం సీజన్లో ప్రభు త్వం హైడ్రేషన్ పత్తి సాగు విధానానికి శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలోని 79 వ్యవసాయ క్లస్టర్లుండగా.. ఈ సీజన్లో 30 క్లస్టర్ల ను హైడ్రేషన్ పత్తి సాగు విధానానికి ఎంపిక చేసినట్లు జిల్లా అదికారులు పేర్కొంటున్నారు. ఎకరానికి 750 గ్రాముల పత్తి విత్తనాలను వేసు కోవడం వల్ల ఎకరంలో 5 వేల మొక్కలు మాత్ర మే విత్తుకునే అవకాశం ఉంది. ఎకరంలో పత్తి దిగుబడి 6-8 క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. అదే హెచ్డీ పత్తి విత్తనాల సాగు వల్ల ఒక ఎకరంలో 750 గ్రాముల పత్తి విత్తనాలను ఐదు విత్తుకో వడం వల్ల సుమారు 15వేల మొక్కలు వేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల సాధారణ పత్తితో పోల్చి తే ఈ పత్తి దిగుబడి రెండు రేట్లు అధికంగా వస్త్తుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొం టున్నారు. ఈ పంట 120 రోజుల్లో రైతు చేతికి పంట వస్తోంది. జిల్లాలో ఇప్పటికే ప్రయోగా త్మకంగా ఈ సీజన్లో వంద ఎకరాల్లో హెచ్డీ పత్తి సాగుచేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వ ప్రోత్సాహం..
వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల వారీగా హెచ్డీ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచింది. బ్యాగు ధర రూ. 730 కాగా రైతు కొనుగోలు చేసిన తర్వాత సాగు చేసిన వెంటనే వ్యవ సాయశాఖ అధికారులు ధ్రువీకరణ ఇస్తే రైతు కొన్న బ్యాగు ధరలపై ప్రభుత్వం వందశాతం సబ్సిడీ అందజేస్తూ రైతు ఖాతాల్లో నగదును జమ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో సారం గాపూర్, కుంటాల, కుభీర్, లోకేశ్వరం, ముధోల్, తదితర మండలాల్లో 50 ఎకరాల్లో పత్తిని సాగు చేసేందుకు రైతులు ముందుకొచ్చారు.
నేడు మంత్రిచే విత్తనాల ఆవిష్కరణ
హెచ్డీ పత్తి సాగు విధానంపై వ్యవసాయశాఖ రైతులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో విత్తనాల బ్యాగులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శనివా రం ఆవిష్కరించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్ తెలిపారు. ఈ విధానం సాగుచేయడం వల్ల పత్తి పంట దిగుబడులు పెరగడమే కాకుండా కూలీల కొరతను ఉండదని పేర్కొంటున్నారు.