ఆదిలాబాద్ రూరల్, జూన్ 13 : వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం ప్రారంభమయ్యాయి. నూతనంగా పాఠశాలలకు వస్తున్న విద్యార్థులను ఆకర్షించేందుకు ఆయా విద్యాసంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పలు పాఠశాలల్లో విద్యార్థుల కోసం స్వాగత తోరణాలు, బెలూన్లతో ప్రత్యేకంగా అలంకరించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను ఎంతో ఉత్సాహంగా పాఠశాలలకు తీసుకువచ్చి కూర్చోబెట్టారు.
బేల, జూన్ 13 : బడి బాట కార్యక్రమంలో భాగంగా బేల జడ్పీఎస్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోల నర్సింహులు, ఉపాధ్యాయులు పిల్లలకు ఘన స్వాగతం పలికారు.
విద్యర్థులను పూలమాలలతో సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందించారు.
భీంపూర్, జూన్ 13 : మండలంలోని అంతర్గాంలో సర్పంచ్ బక్కి లలిత, ఎస్ఎంసీ చైర్మన్ ఖాదర్, ప్రాథమిక పాఠశాల ప్రాధానోపాధ్యాయు డు శ్రీకాంత్, గ్రామస్తులు ఇంటింటా ప్రచారం ని ర్వహించారు. కరపత్రాలు పంచారు. పాఠశాలలో సౌకర్యాలు వివరిస్తూ, పిల్లలను పాఠశాలలో చే ర్పించాలని కోరారు. ఉప సర్పంచ్ ఉత్తం, అంగన్వాడీ కార్యకర్త సవాయి పుష్పాంజలి, నాయకు లు మేకల బక్కన్న యాదవ్, బక్కి కపిల్యాదవ్, కునార్పు అశోక్ యాదవ్ ఉన్నారు.
ఉట్నూర్, జూన్ 13 : స్థానిక ఆశ్రమ పాఠశాలలో తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన బాగుందని హెచ్ఎం మాణిక్రావు, వార్డెన్ శ్రీదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నార్నూర్, జూన్ 13 : గాదిగూడ మండలం దాబా(కే), సావ్రీ పంచాయతీలో పాటు నార్నూర్ కేజీబీవీ పాఠశాలలను ఎంపీవో షేక్ ఖలీమ్హైమద్ సందర్శించారు. బడిబాటలో పాల్గొన్నారు. సర్పంచ్ ఆనంద్ రావ్, కొడప మోతుబాయి, పంచాయతీ కార్యదర్శి సునీల్, సుభాష్, మాజీ సర్పంచ్ కొపడ జాకు తదితరులున్నారు. మాన్కాపూర్ అంగన్వాడీ కేంద్రంలో బడిబాట నిర్వహించారు. ఉప సర్పంచ్ రాయిసిడాం రూప్దేవ్, అంగన్వాడీ టీచర్ ఆత్ర కమలాబాయి, గ్రామస్తులు, పోషకులు ఉన్నారు.