దిలావర్పూర్, జూన్ 13 : ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులతో కూడిన ఇంగ్లిష్ బోధనను అందిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్(జీ) మండలంలోని రాంపూర్‌లో రామాలయం వద్ద రూ.50 లక్షలతో కల్యాణ మండపం, రూ.12 లక్షలతో భీమన్న ఆలయ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతనం అదే గ్రామంలో ఒడ్డెర సంఘం, ఎస్సీ సంఘం భవనాలను ప్రారంభించారు. అనంతరం ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్కడి నుంచి మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో చెపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మన ఊరు-మన బడి ద్వారా జిల్లాలో మొదటి విడుతలో 260 పాఠశాలలను ఎంపికచేసినట్లు చెప్పారు. జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, జిల్లా పరిషత్ కోఅప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్‌రావు, నిర్మల్ ఆర్డీవో తుకారం, ఎంపీపీ కొండ్రురేఖ, జడ్పీటీసీ రామయ్య, సర్పంచులు రాంరెడ్డి, టీఆర్ఎస్ దిలావర్పూర్ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, పాల్దే అనీల్, రవి, శంకర్, సుదర్శన్‌గౌడ్, కొండ్రు రమేశ్, గంగారెడ్డి, నారాయణ, అధికారులు పాల్గొన్నారు.
బీమా చెక్కు అందజేత..
లక్ష్మణచాంద, జూన్ 13 : మండలంలోని తర్పెల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త భీమేశ్ విద్యుదాఘాతంతో మృతిచెందగా, ఆయనకు రూ.2లక్షల బీమా మంజూరైంది. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో భీమేశ్ భార్యకు మంత్రి చెక్కును అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, వారి సంక్షేమానికి టీఆర్ఎస్ ఎల్లవేళలా కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, టీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అల్లోల సరేందర్ రెడ్డి, మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, నాయకులు మహేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.
కొరిటికల్‌లో..
మామడ, జూన్ 13 : మండలంలోని కొరిటికల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మోతె రాజేశ్వర్ కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా, ఆయనకు రూ.2లక్షలు మంజూరవగా, రాజేశ్వర్ కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అక్కనిపెల్లి శ్రీనివాస్, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ నల్ల లింగారెడ్డి, నాయకులు ముగల రత్నయ్య, భూషణ్, అందె రాజేశ్వర్, నవీన్, రవి, రఘ తదితరులున్నారు.
బాధితులకు పరామర్శ..
మండలకేంద్రంలో గాలివానతో ఇల్లు దెబ్బతినగా, బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. సుమారు 13 ఇండ్లు దెబ్బతినగా, నష్టపరిహారం అందించి అదుకుంటామని హామీ ఇచ్చారు. వివరాలను పూర్తిస్థాయిలో అంచనా వేయాలని అధికారులను అదేశించారు. అలాగే బండల్ ఖానాపూర్ అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా, కుటుంబ సభ్యులను పరమర్శించారు. మంత్రి వెంట కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ రాంబాబు, వైస్ ఎంపీపీ లింగారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, సర్పంచ్ హన్మాగౌడ్, తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీడీవో మల్లేశం, నాయకులు చంద్రశేఖర్‌గౌడ్, అశోక్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.