లక్ష్మణచాంద, జూన్ 9 : నెల నెల ప్రభుత్వం నిధులు అందిస్తుండడంతో గ్రామాలు వేగంగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. పొట్టపెల్లి (కే) గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన పోచమ్మ ఆలయం, రూ.10 లక్షలతో నిర్మించిన భీమన్న ఆలయాన్ని గురువారం మంత్రి ప్రారంబించారు. అనంతరం క్రీడా మైదా నాన్ని ప్రారంభించారు. పశుసంవర్ధ్దక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొర్రె, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ చేసే కార్యక్ర మాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీలు, మురుగు కాలువలతో అవసరమైన అన్నిసౌకర్యాలను ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు.
యాసం గిలో పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం వెనుకడుగు వేస్తే, ప్రభుత్వం ఎంత భారమైనా వడ్లను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. పొట్టపెల్లి (కే)లో ఇప్పటికే రూ. 9. 5 లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టామని, మరో 30 లక్షల నిధులు మంజూరు చేస్తానని పేర్కొ న్నారు. కొన్ని మీడియా సంస్థలు సీసీరోడ్ల బిల్లుల ను ప్రభుత్వం చెల్లించడం లేదని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘు నందన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేం దర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, జడ్పీ సీఈవో సుధీర్ కుమార్, తహసీల్దార్ కవితా రెడ్డి, ఎంపీడీవో శేఖర్, టీఆర్ఎస్ మండల కన్వీ నర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి అడ్వాల రమేశ్, సర్పంచ్ పుల్వాజీ హైమావతి, ఎంపీవో నసీరు ద్దీన్, మండల పశువైద్యాధికారి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ హయాంలోనే మహర్దశ
నిర్మల్ అర్బన్, జూన్ 9 : సీఎం కేసీఆర్ హయాంలోనే పట్టణాలకు మహర్దశ వచ్చిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని షేక్ సాహెబ్‌పేట్‌లో పర్యటించారు. వార్డులో నూతన రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తున్నట్లు తెలిపా రు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, వార్డు కౌన్సిలర్ అబ్రార్, పట్టణ కౌన్సిలర్లు పూదరి రాజేశ్వర్, లక్కాకుల నరహరి, నల్లూరి పోశెట్టి, రఫీ, నాయ కులు అమ్జద్, ముషీర్, ముజాహిద్, మజర్ తదితరులు పాల్గొన్నారు.