ఆదిలాబాద్ రూరల్, జూన్ 6: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే సర్కారు లక్ష్యమని, ఇందుకోసం ‘మన బస్తీ-మన బడి’ పేరిట కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. పట్టణంలోని సరస్వతీ నగర్లో గల జడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఈయేడాది నుంచి ప్రతి బడిలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తామన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మన బస్తీ-మన బడి కార్యక్రమం రూపొందించిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని సరస్వతినగర్లోని జడ్పీ హైస్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఈ ఏడాది నుంచి పరభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తున్నామని చెప్పారు. కేజీ టు పీజీ వరకు విద్యార్థులకు ఎలాంటి ఖర్చులేకుండా విద్యనందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలవైపు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల మౌలికవసతులతో పాటు, నాణ్యమైన విద్యనందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీఈవో ప్రణీత, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, హెచ్ఎం మంజుల పాల్గొన్నారు.
ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ప్రారంభం
జైనథ్, జూన్ 6: గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. సోమవారం గిమ్మలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనడానికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తామన్నారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, ఎంపీటీసీ భోజన్న, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తంయాదవ్, నాయకులు పరమేశ్వర్, కేశవ్ ఉన్నారు.