బోథ్, జూన్ 6 : పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామస్తులంతా భాగస్వాములు కావాలని జడ్పీ సీఈవో గణపతి పిలుపునిచ్చారు. పల్లె ప్రగతిలో భాగంగా బోథ్ మండలంలోని కౌఠ (బీ), సాకెర గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పా ల్గొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయాలన్నారు. బీసీ వసతి గృహంలో పిచ్చిమొక్క లు తొలగించారు. ఎంపీపీ తుల శ్రీనివాస్, ఎంపీడీవో దుర్గం రా జేశ్వర్, ఎంపీవో జీవన్‌రెడ్డి, ఏపీవో జగ్దేరావు, సర్పంచ్ రాధిక, ఉప సర్పంచ్ రవీందర్, గంగాధర్ పాల్గొన్నారు. బోథ్, అందూ ర్, కన్గుట్ట, ధన్నూర్ (బీ), పొచ్చెర, సొనాల తదితర గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. బోథ్‌లోని ఫ్రెండ్స్ క్లబ్ ఆవరణలో శ్రమదానం చేసి పిచ్చిమొక్కలు తొలగించారు. పరిసరాలు శుభ్రం చేశారు. సర్పంచులు సురేందర్‌యాదవ్, శ్యామల, గంగాధర్, సదానందం, మల్లేశ్, వీడీసీ చైర్మన్ గంగాధర్, జీ నందయ్య, ఈవో అంజయ్య, ఎలుక రాజు పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టి సారించాలి
ఇచ్చోడ, జూన్ 6 : గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంప్ యా ర్డుల్లో సేంద్రియ ఎరువుల తయారీపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని జామిడి జీపీని ఆయన సందర్శించారు. డంప్ యార్డు, వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేరు చేసి, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సేంద్రియ ఎరువులను తయారు చేసుకొని అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. సర్పం చ్ హరన్ సుభాష్ పాటిల్, ఎంపీవో కొమ్ము రమేశ్, పంచాయతీ కార్యదర్శి జ్ఞానేశ్వర్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
నేరడిగొండ మండలంలో..
నేరడిగొండ, జూన్ 6: మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అన్ని గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మండల ప్రత్యేకాధికారి రవిశంకర్, ఎంపీడీవో అబ్దుల్ సమద్, ఎంపీవో శోభన దర్భ, దర్భతండా, రాజురా, మాదాపూర్ తదితర గ్రామాలను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి
సిరికొండ, మే 6 : నర్సరీలో నాటిన ప్రతి మొక్కనూ బతికించాలని ప్రత్యేకాధికారి, డిప్యూటీ తహసీల్దార్ శంకర్ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని సుంకిడి గ్రామంలో నర్సరీని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని పేర్కొన్నారు. జీవకోటికి మొక్కలే జీవనాధారమన్నారు. మొక్కను బతికించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశంలో అడవులు అంతరించిపోవడంతో పాటు వాతావరణలో పెను మార్పులు సంభవించి వర్షాలు సమయానికి రావడం లేదన్నారు. చెట్లుంటే సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని పేర్కొన్నారు. సర్పంచ్ అనిత, కార్యదర్శి అరుణ్, ఉపాధి హామీ టీఏ ధన్‌రాజ్ ఉన్నారు.
పట్టణాన్ని శుభ్రంగా ఉంచుదాం..
ఉట్నూర్, జూన్ 6 : పట్టణంలోని అన్ని వార్డులను శుభ్రంగా ఉంచుదామని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చీపుర్లతో అధికారులు శ్రమదానం చేశారు. పల్లెప్రగతిలో భాగంగా వార్డుల్లోని సమస్యలు పరష్కరించాలని సూచించారు. ఎంపీడీవో తిరుమల, అధికారులు పాల్గొన్నారు.
పిచ్చిమొక్కలు తొలగింపు
ఉట్నూర్ రూరల్, జూన్ 6 : పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తహసీల్దార్ భోజన్న అన్నారు. మండలంలోని శ్యాంపూర్ గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సిబ్బందితో కలిసి పిచ్చిమొక్కలు తొలగించారు. పల్లె ప్రగతి కార్యక్రమం
లో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సర్పంచ్ గుం డాల మల్లిక, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, ఉప సర్పంచ్ కేశవ్, కో ఆప్షన్ సభ్యుడు జాడి మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
ఇంద్రవెల్లి, జూన్ 6 : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ఎంపీడీవో పుష్పలత అన్నారు. మండలంలోని కెస్లాపూర్ గ్రామ పంచాయతీలో చేపడుతున్న సీసీరోడ్డు, హైమాస్ట్ లైటింగ్ పోల్స్ ఏర్పాటు పనులను ఆమె పరిశీలించారు. గ్రామాల్లో ప్రతిరోజూ పారిశుధ్య పనులు చేయాలన్నారు. సర్పంచ్ మెస్రం రేణుకానాగ్‌నాథ్, మాజీ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్, కార్యదర్శి మహ్మద్ మోతేశాం, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ముమ్మరంగా..
ఇంద్రవెల్లి, జూన్ 6 : గ్రామాల్లో ముమ్మరంగా పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. రోజువారీగా చేపట్టే కార్యక్రమాలను అధికారులు గ్రామాల్లో చేపట్టారు. ఎంపీడీవో పుష్పలతతోపాటు ఎంపీవో సంతోష్ వేర్వేరుగా పరిశీలించారు. అంజీ, వా ల్గొండ, హీరాపూర్, కెస్లాపూర్, బిక్కుతండా, ముత్నూర్, సమక, శంకర్‌గూడ, వడగాం, ఇంద్రవెల్లి గ్రామపంచాయతీల పరిధిలో పారిశుధ్య పనులు చేపట్టారు. సర్పంచ్‌లు కోరెంగా గాంధారి, మెస్రం రేణుకా నాగ్నాథ్, కినక జుగాదిరావ్, గారుళే కుసుమబాయి, సోయం రాంబాయి, తుంరం భాగుబాయి, ఆడే విజ య, గోడం నాగోరావ్, కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, సంజీవరావ్, మహ్మద్ మోతేశాం, నసీమా, జీవన్, అనిత పాల్గొన్నారు.
నార్నూర్ మండలంలో..
నార్నూర్, జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని డివిజన్ పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ పంచాయతీ సిబ్బందికి సూచించారు. మండలంలోని తాడిహత్నూర్, భీంపూర్ గ్రామాల్లో పర్యటించారు. పల్లెప్రగతి పనులను పరిశీలించారు. గ్రామాల్లో నిరంతరం అవెన్యూ ప్లాంటేషన్, పల్లెప్రకృతివనం తదితరవి ప్రణాళిక ప్రకారం నిర్వహించాలన్నారు. ఎంపీవో స్వప్నశీల, సర్పంచ్ రాథోడ్ విష్ణు, తాడిహత్నూర్ ఉప సర్పంచ్ ఫడ్ విష్ణు, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శులు రాజు, శేఖర్, గ్రామస్తులున్నారు.
అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందించాలి
నార్నూర్, జూన్ 6 : అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తహసీల్దార్ ఆర్కా మోతీరామ్ అన్నారు. గాదిగూడ మండలం డొ ంగర్గావ్ గ్రామంలో సోమవారం పల్లెప్రగతి పనులు పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రక్తహీనత నిర్మూలనకు కృషి చేయాలన్నారు. సర్పంచ్ జాదవ్ యశోధాబాయి,కా ర్యదర్శి నిఖిల్ పాల్గొన్నారు.