ఎదులాపురం, జూన్ 6 :తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ(టీఎస్ఆర్జేసీ) ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 2,365 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,869 మంది హాజరు కాగా.. 496 మంది గైర్హాజరయ్యారు. త్వరలో ఫలితాలు వెల్లడించి, ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ గంగా శంకర్ తెలిపారు.
2022-23 విద్యా సంవత్సరం తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల(టీఎస్ ఆర్జేసీ)లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి సోమవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ గంగాశంకర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగింది. 2,365 మంది విద్యార్థులకు గాను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 11 పరీక్షా కేంద్రాల్లో 1869 మంది పరీక్ష రాసినట్లు గంగాశంకర్ తెలిపారు.
496 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఇందులో ఎంపీసీలో 1,145 మందికి 883 మంది పరీక్ష రాయగా, 262 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. బైపీసీలో 1,187 మందికి 958 మంది పరీక్షా రాయగా, 229 మంది గైర్హాజరయ్యారన్నారు. ఎంఈసీలో 33 మందికి 28 మంది పరీక్ష రాయగా, ఐదుగురు గైర్హాజరయ్యారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని శిశుమందిర్ పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట అధికారులు వేణుగోపాల్, బచాన్సింగ్ తదితరులు ఉన్నారు.