ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, జూన్ 6;వానకాలం సాగుకు సమయం ఆసన్నమైంది. రుతు పవనాలు త్వరలో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలుపడంతో రైతన్నలు ఏరువాక సాగుతున్నారు. సర్కారు రైతుబంధు, ఉచిత కరంటు ఇస్తుండడంతో హుషారుగా చేలకు పయనం అవుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని, విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండడంతో విత్తనాలు విత్తుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి.. ఆదిలాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామాల్లో రైతన్న దున్నుతుండగా.. మహిళా కూలీలు విత్తనాలు విత్తుతున్నారు. ఈ దృశ్యాలను ‘నమస్తే’ క్లిక్మని పించింది.