
ఇంద్రవెల్లి, జూలై 9 : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులు చేపట్టాలని జడ్పీ సీఈవో గణపతి సూచించారు. మండలంలోని ఏమాయికుంట, సమక, తుమ్మగూడ, ఇంద్రవెల్లి గ్రామపంచాయతీలో అధికారులతో కలిసి పర్యటించారు. పల్లె ప్రగతి పనులను శుక్రవారం పరిశీలించారు. పారిశుధ్యంతోపాటు అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పల్లె ప్రకృతి వనాలతోపాటు డంప్ యార్డులు, నర్సరీలు, శ్మశానవాటికలు, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎల్పీవో భిక్షపతిగౌడ్, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో సంతోష్, సర్పంచ్ జాదవ్ లఖన్సింగ్, పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్, ఎంపీటీసీ పడ్వాల్ విజయ్‌సింగ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలి
సిరికొండ,జూలై 9: పల్లె ప్రగతి, హరితహారంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆధికారులకు జడ్పీ సీఈవో గణపతి సూచించారు. మండల కేంద్రంతో పాటు సొంపల్లి, పొన్న, రాయిగూడ, సుం కిడి, కొండాపూర్ గ్రామపంచాయతీల్లో పర్యటించారు. అన్ని గ్రామాల్లో మొక్కలు నాటి, వాటికి కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి విజయ్, ఎంపీడీవో సురేశ్, ఎంపీవో అతుల్, కో ఆప్షన్ సభ్యుడు మాణిక్ రావ్, సర్పంచ్‌లు చంద్రకళ, శాంతాబాయి, నర్మద,లక్ష్మి, అనిత, కార్యదర్శులు పాల్గొన్నారు.