తాంసి, జూన్ 6: రైతుల వద్దకే వెళ్లి ఎరువులు, విత్తనాలు అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పొన్నారిలో డీసీసీబీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించే గోదాంకు సంబంధించిన భూమిని పరిశీలించారు. ఈసందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి దూర ప్రాంతంలో ఉన్న పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. దీంతో రైతుల సమయం, డబ్బులు వృథా అవుతున్నాయని చెప్పారు. ఎరువులు, విత్తనాలు గ్రామాల్లోనే లభించేలా సహకార బ్యాంకు ఆధ్వర్యంలో మొదట 10 గోదాంలు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. వీటి నిర్మాణం పూర్తయితే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇక్కడ పీఏసీఎస్ మాజీ చైర్మన కే కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రమణ, సర్పంచ్ సంజీవ్‌రెడ్డి, ఉప సర్పంచ్ అశోక్, పీఏసీఎస్ డైరెక్టర్ చందన్న, నాయకులు మల్లయ్య, దేవేందర్, లింగారెడ్డి, తిరుపతి, లక్ష్మణ్ ఉన్నారు.