దిలావర్పూర్, జూన్ 6 : గ్రామాల అభివృద్ధే పల్లె ప్రగతి ధ్యేయమని నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని మాడెగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన మోడల్ అంగన్వాడీ భవనాన్ని సోమవారం జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు పౌష్టికాహారం అందించారు. పక్కనే ఏర్పాటు చేసిన క్రీడా మైదాన్ని ప్రారంభించారు. యువకులతో వాలీబాల్, మహిళలతో రింగ్‌బాల్ ఆడారు. అక్కడి నుంచి కదిలి గ్రామ పరిసరాల్లోని నర్సరీని పరిశీలించి, తీవ్రమైన ఎండలోనూ గుట్టలపై నర్సరీ చాలా బాగుందని అధికారులను అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం చెపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ పాల్ధే అనీల్‌ను స్థానిక సర్పంచ్ సరితారాజు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రగతి రాష్ట్ర పరిశీలకుడు నర్సింహులు, జడ్పీసీఈవో సుధీర్, డీఆర్డీవో తుకారం, ఎంపీపీ పాల్దే అనీల్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, ఎంపీడీవో మోహన్, తహసీల్ధార్ క రీం, ఎంపీవో అజీజ్‌ఖాన్, సర్పంచ్ సరితారాజు, ఈ జీఎస్ ఏపీవో జగన్నాథం, పంచాయతీ కార్యదర్శి సునీల్, టీఆర్ఎస్ నాయకులు మాధవురావు, ఎల్ల య్య, గుణవంతురావు, మోహన్ పటేల్ ఉన్నారు.
కదిలి ఆలయంలో పూజలు..
మండలంలోని ప్రసిద్ధ కదిలి పాపహరేశ్వర ఆలయంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగానికి అభిషేకం చేసి, మాత అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ భుజంగ్రావుపటేల్, ఆలయ అధికారులు కేశవులు, పండితులు ఉన్నారు.