భీంపూర్, మే 11 : ప్రభుత్వం వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు రూ.368 కోట్ల తో, 1.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలని ఆదిలాబా ద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. భీంపూర్ మండలం పిప్పల్‌కోటి శివారులో రిజర్వాయర్, చనాకా-కొర్ట బ్యారేజీకి సంబంధించి ప్రధాన, పిల్ల కాలువల పనులను బుధవారం ఆమె పరిశీలించారు. హత్తిఘాట్ పంప్‌హౌస్, కొర్ట -చనాకా వద్ద ఉన్న బ్యారేజీ కేంద్రంగా కాలువ పనుల పురోగతిని మ్యాపు ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. పంప్‌హౌస్ ట్రయల్న్‌క్రు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డీ-1 కాలువను పరిశీలించారు. నీ టి ప్రవాహం, ఆయకట్టు అంశాలను మ్యాపు ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రిజర్వాయర్ వరకు వెళ్లేందుకు నాలుగు కిలోమీటర్ల డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పూర్తిచేయాలని రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. ఇదివరకటి భూసేకరణ పరిహారాలు, తదితర అంశాలపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో చర్చించారు. పరిహారం ఎకరాకు రూ.15 లక్షల వరకు పెంచి ఇవ్వాలని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. పనులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరందించాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ నటరాజ్, పెన్‌గంగ డివిజన్ ఎస్ఈ రాము, ఆర్డీవో రాజేశ్వర్ , డీఈలు తులసీరాం, మురళీకృష్ణ, సునీల్, ఏఈలు మాళవిక, తిరుపతి, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్ కేమ కల్యాణి, ఉప సర్పంచ్ దొంతుల సుభాష్, రైతులు ఉన్నారు.