మంచిర్యాల అర్బన్, మే 7 : వానకాలం ప్రణాళికను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలో 3.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఇందుకోసం 32 వేల క్వింటాళ్ల విత్తనాలు, 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. వీటిని క్లస్టర్ల పరిధిలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. క్షేత్ర, మండల స్థాయి అధికా రుల పర్యవేక్షణంలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండడంతో విత్తనాలు, ఎరువులు అధికంగా తెప్పిస్తున్నారు.
2022-23 వా నకాలం వ్యవసాయ ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో 10. 025 లక్షల ఎకరాల భూ విస్తీర్ణం ఉండగా ఈ ఏడాది 3.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయని, ఇందులో 3.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ , 21 వేల ఎకరాల్లో ఉ ద్యానవన పంటలు సాగవుతాయని సంబంధిత శాఖల అధికారులు అంచనా వేశారు. గతేడాది 3.50 లక్షల ఎకరాల్లో (3,28,791 ఎకరాల్లో వ్యవసాయ, 21,415 ఎకరాల్లో ఉద్యానవన) పంటలు సాగయ్యాయి. జిల్లాలో కడెం మేజర్ ప్రాజెక్టు కింద 25,081 హెక్టార్లు, మూ డు మీడియం ప్రాజెక్టు (నీల్వాయి, ర్యాలీ వా గు, గొల్లవాగు) కింద 2833 హెక్టార్లు, 89 7 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 33, 202 హెక్టార్లు, గూడెం లిప్ట్ కింద 25,081 హెక్టార్ల భూమి సాగవనుంది. ఇందుకోసం 32 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉండగా, సీజన్ కు ముందుగానే విత్తనాలు, ఎరువులు తీసుకువచ్చే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది.
జిల్లాలో లక్షా 84 వేల మంది రైతులు..
మంచిర్యాల జిల్లాలోని 384 రెవెన్యూ గ్రామా ల్లో 1, 84, 398 మంది రైతులున్నారు. ఇం దులో బెల్లంపల్లి వ్యవసాయ డివిజన్లోని బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు మండలాల్లోని 58 గ్రామాల్లో 22,425 మంది రైతులు, భీమిని పరిధిలోని భీమిని, కన్నెపల్లి, నెన్నెల, వేమనపల్లి మండలాల్లోని 104 గ్రామాల్లో 39,661 మంది రైతులు, చెన్నూర్‌లోని భీమా రం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని 117 గ్రామాల్లో 57,986 మంది రైతులు, మంచిర్యాల వ్యవసాయ డివిజన్లోని దండేపల్లి, హాజీపూర్, లక్షెట్టిపేట, జన్నారం, మంచిర్యాల, నస్పూర్ మండలాల పరిధిలోని 105 గ్రామాల్లో 64,326 మంది రైతులున్నారు.
3.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు…
గత ఏడాది వానకాలంలో 3.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా ఈ ఏడాది 3. 85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అధికంగా పత్తి 1,90,300 ఎకరాలు, వరి 1, 59,473, కందులు 12000, పెసర 1590, మినుములు 305, 332 ఎకరాల్లో సోయా, మక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగ య్యే అవకాశం ఉందని, మరో 21 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతాయని అధికారులు చెబుతున్నారు.
32 వేల క్వింటాళ్ల విత్తనాలు…
ఈ వానకాలం సీజన్లో 32 ,325 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో 31,892 క్వింటా ళ్ల వరి ధాన్యం, 37.5 క్వింటాళ్ల సోయా, 24 3.5 క్వింటాళ్ల కందులు, 127.2 క్వింటాళ్ల పెసర, 24.4 క్వింటాళ్ల మినుములు, అలాగే 3,59,220 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరమవుతాయని పేర్కొంటున్నారు. సీజన్‌కు ముందుగానే రైతులకు అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
1.10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు..
ఈ వానకాలంలో లక్షా 10 వేల 415 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో యూరియా 42, 900 మెట్రిక్ టన్నులు, డీఏపీ 22 ,300 మె. ట, కాంప్లెక్స్ ఎరువులు 24000 మె.ట, ఎం వోపీ (మ్యూరేట్ ఆఫ్ పొటాష్) 14, 075 మె .ట, ఎస్ఎస్పీ (సింగిల్ సూపర్ సల్ఫేట్ ) 3 ,980 మె . ట, జింక్ సల్ఫేట్ (జడ్ఎస్వో4) 3 ,160 మెట్రిక్ టన్నులు అవసరముంటుందని అంచనా వేసి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశారు. విడతల వారీగా ఎరువులను జిల్లాలోని రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక రూపొందించారు.
సీజన్‌కు ముందే ఎరువులు, విత్తనాలు
రైతులకు ఎలాంటి ఇ బ్బందుల్లేకుండా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉం చేందుకు ప్ర ణాళికతో ముందుకెళ్తున్నాం. క్లస్టర్ వారీగా విత్తనాలు, ఎరువులను అం దించేందుకు ప్ర యత్నిస్తున్నం. జిల్లాలోని 48 క్లస్టర్ల ద్వారా క్షేత్రస్థాయి, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూ స్తాం. సాగు విస్తీర్ణం పెరుగుతుందనే అంచనాతోనే గతంలో కంటే ఎరువులు, విత్తనాలను ఎక్కువగా తెప్పిస్తున్నం.
– కల్పన, జిల్లా వ్యవసాయాధికారి,మంచిర్యాల