మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 26 : జిల్లాలోని దవాఖానల నుంచి వెలువడే బయో మెడికల్ వ్యర్థాలను నిల్వ లేకుండా సకాలంలో తొలగించాలని కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జాతీయ కా లుష్య నియంత్రణ మండలి, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ సంస్థ ప్రతినిధులతో మంగళ వారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ జిల్లాలో 1900 పడకలు ఉ న్నాయని మెడికల్, డెంటల్ అసోసియేషన్లు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల సమన్వయంతో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ సంస్థకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుసుం చెల్లించాలన్నారు. బయో మెడికల్ వేస్టేజ్ మేనేజ్మెంట్ – 2016 అమల్లో భాగంగా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామని, జిల్లాలోని దవాఖానలు కాలుష్య నియంత్రణ మం డలి అనుమతులు తీసుకోవాలన్నారు. వెంకట రమణ ఇన్సినిరేటర్స్ సంస్థ వారు బయో మెడికల్ వ్యర్థాలను అన్ని దవాఖానల నుంచి సేకరిస్తారని చెప్పారు. ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ భిక్షపతి, డీఎంహెచ్వో సుబ్బారాయుడు, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఐఎంఏ ప్రతినిధులు, డెంటల్ అసోసియేషన్ ప్రతినిధులు, సీఐ, అధికారులు పాల్గొన్నారు.