కాగజ్నగర్ రూరల్, ఏప్రిల్ 26 : గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ చీపురుశెట్టి శంకర్ అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే పంచాయతీ, మిషన్ భగీరథ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయా శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. మిషన్ భగీరథ డీఈ సిద్దిఖీ మాట్లాడుతూ మండలంలో ఇంటింటికీ నీటి సరఫరా చేస్తున్నామన్నారు.
ఈస్గాం, నజ్రుల్నగర్ గ్రామాల్లో నీటి సమస్య ఉందని, నజ్రుల్నగర్ మార్కెట్ ఏరియాలో పైపులైన్ వేయకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని ఎంపీటీసీలు అమిత్దాస్, కు మార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన జడ్పీవైస్ చైర్మన్ పైపులైన్ ఎందుకు వేయలేదని, ఇంటింటా సర్వే చేసి కుళాయిలు లేని వారి వివరాలను అందజేయాలని డీఈకి సూచించారు. ఏవో రామకృష్ణ మాట్లాడుతూ మండలంలో 11,486 మంది రైతులకు రూ. 17,47,85,112 పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. అలాగే 2021-22 సంవత్సరంలో 17 మంది రైతుబీమా అందించామన్నారు.
నాలుగు ఏళ్లుగా ఉపాధిహామీ ద్వారా మండలంలో మొక్కల పెం పకానికి నిధులు కేటాయించారని, ఏపీవో బుచ్చన్నను నిలదీశారు. మొక్కలు ఎక్కడ నాటారు.. ఎంత ఎత్తు పెరిగాయి.. ఎన్ని నిధులు ఖర్చు చేశారో సభ దృష్టికి తెలియజేయాలని జడ్పీవైస్ చైర్మన్ ఆదేశించారు. అనంతరం ఐసీడీఎస్, విద్య, వై ద్యం, పంచాయతీరాజ్ శాఖల అధికారులు తమ నివేదికలు చ దివి వినిపించారు. సమావేశంలో కోఆప్షన్ సభ్యుడు సిద్దిఖీ, పీఏసీఎస్ చైర్మన్ ఉమామహేశ్వర్రావు, ఎంపీడీవో సుశీల్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.