ఆదిలాబాద్, ఏప్రిల్ 25 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలోని జైనథ్ మహిళా ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జైనథ్ మండలంలోని ఆనంద్‌పూర్‌కు చెందిన ఇద్దరి అరెస్ట్‌కు సంబంధించి బీజేపీ నాయకులు ఆదివారం జైనథ్‌లో ఆందోళన చేపట్టారు. వారిని సముదాయించడానికి వచ్చిన డీఎస్పీతో వాగ్వాదానికి దిగడంతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దళిత మహిళా ఎస్ఐని దుర్భాషలాడుతూ, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్, ఆదిలాబాద్ ప్ర ధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పా యల్ శంకర్ వ్యాఖ్యలతో బీజేపీ మహిళలకు ఎ లాంటి గౌరవాన్ని ఇస్తున్నదో దీనిద్వారా అర్థమవుతుందని మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీ వెంకటేశ్వర్రావుకు మహి ళా సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆదిలాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దళిత ఐక్యసంఘాల నాయకు లు మాట్లాడారు. దళిత మహిళా పోలీసు అధికారి ని అసభ్య పదజాలంతో దూషించడం తగదన్నారు.
నాయకుడెలా అయ్యాడో..?
మహిళా ఎస్ఐపై అనుచితంగా మాట్లాడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నైతికంగా దిగజారారు. మహిళలపై గౌరవం లేని ఆయన నాయకుడు ఎలా అయ్యారో అర్థంకావడంలేదు. ఏదైనా విషయం ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. చట్టపరంగా చర్యలు తీసుకునే వీలుంటుంది. కానీ, డీఎస్పీ ముందే వ్యక్తిగతంగా దూషించి తన విలువను తానే పాతాళానికి దిగజార్చుకున్నాడు. ఈ విషయంపై మహిళా సంఘాలు ఊరుకోవు. బీజేపీ నాయకుడి అరెస్టు జరగాల్సిందే.
– కస్తాల ప్రేమల, ఐసీడీఎస్ మాజీ చైర్పర్సన్, ఆదిలాబాద్
ఎస్ఐకి క్షమాపణలు చెప్పాల్సిందే..
జైనథ్ ఎస్ఐపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈ సభ్య సమాజం తలదించుకునేలా చేశాయి. ఒక దళిత పోలీసు అధికారిణిపై పరుషపదజాలం ఉపయోగించిన శంకర్ పేదలకు, మహిళలకు, దళిథులకు నాయకుడిగా ఏం సేవలు చేస్తారో తెలిసిపోయింది. వెంటనే ఎస్ఐకి క్షమాపణలు చెప్పాల్సిందే. లేకపోతే ఆయన ఇంటి ఎదుట నిరసన దీఓలు మొదలు చేస్తాం. అలాగే పోలీసు ఉన్నతాధికారులు తక్షణం శంకర్‌ను, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలి.
– తుల్జాపురే శోభ, దళిత సంఘం నాయకురాలు, ఆదిలాబాద్
మహిళలంటే ఇంత వివక్షా..
మహిళలు, దళితుల న్యాయం కోసం మైకుల్లో నీతులు చెప్పే బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌కు అంతరంగంలో మహిళలంటే ఇంత చిన్న చూపు ఉన్నదని సమాజానికి ఇప్పుడు తెలిసిపోయింది. మాటిమాటికీ పోలీసుల విధులకు ఆటంకం కలిగించే ఈ బీజేపీ నాయకుడు, అనుచర గణంపై పోలీసులు ఉక్కుపాదం మోపాలి. ఒక మహిళా అధికారిణిని నీచంగా భావించి మాట్లాడిన శంకర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి జైలు పంపాలి. క్షమాపన చెప్పే దాకా మహిళా సంఘాలు వదలవు.
– స్వరూపారాణి, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు