ఆసిఫాబాద్,ఏప్రిల్4 : ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు మంగళవారం ఆసిఫాబాద్‌కు వచ్చారు. జిల్లా కేంద్రంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన థియేటర్లో కలెక్టర్ రాహుల్‌రాజ్,అదనపు కలెక్టర్లు వరుణ్‌రెడ్డి,రాజేశం,కుమ్రంభీం మనుమడు సోనేరావుతో కలసి ఆర్ఆర్ఆర్ సినిమా ను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. మహిళలు సినిమా థియేటర్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే మొదటి సారి కొనియాడారు. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్ తెలంగాణలోని కుమ్రంభీం జిల్లాలో మాత్రమే ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తీయడంతోనే కుమ్రంభీం పుట్టిన గడ్డకు వచ్చినట్లు తెలిపారు. అంతకుముందు భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డైరెక్టర్ రాజమౌళి వస్తునట్లు తెలుసుకున్న అభిమానులు థియేటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఆయన కోసం దాదాపు రెండు గంటల పాటు వేచి చూశారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
పోలీసుల బందోబస్తు…
డీఎస్పీ శ్రీనివాస్ అధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.జిల్లా కేంద్రంలోని అర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద విడిది ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి థియేటర్ వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐలు అశోక్, సుధాకర్, ఎస్ఐలు జగదీశ్, గంగన్న, దీకొండ రమేశ్, సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.