కుంటాల, ఫిబ్రవరి, 26 : పేదల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. తన నివాసంలో కుంటాల మండలం కల్లూర్ గ్రామానికి చెందిన పలువురు బాధితులకు శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్వోసీలను అందజేశారు. కల్లూర్ గ్రామానికి చెందిన సీహెచ్ లక్ష్మణ్‌కు రూ.3 లక్షలు, సీ ఆమనికి రూ.59 వేల చొప్పున ఎల్వోసీని బాధిత కుటుంబాలకు అందజేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం అందిస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తమ చికిత్సకు సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా సహాయం మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు బండి రమణ గౌడ్, డాక్టర్ భోజన్న, చౌహాన్ రాజు పాల్గొన్నారు.
భైంసా, ఫిబ్రవరి 26 : ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద నియోజకవర్గానికి సం బంధించి సుమారు రూ.45 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ మంజూరు కోసం పంపినట్లు ఎ మ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని వి శ్రాంతి భవనంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలో ఈ పథకం కింద మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్య అందించి వారిని సమున్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ నిధులతో నియోజకవర్గంలోని పాఠశాలల్లో అదనపు తరగతుల ని ర్మాణం, ప్రహరీలు, రంగులు వేయడం, కంప్యూటర్, సైన్స్‌ల్యాబ్ ఏర్పాటు, విద్యుద్ధీకరణ, తాగునీరు, నిరంతర నీటి సరఫరా, మరుగుదొడ్లు, వం టగది, భోజనశాల తదితర పనులు చేపడుతామన్నారు. మొదటి దశలో భైంసా పట్టణానికి రూ.6.08 కోట్లు, భైంసా మండలానికి రూ.5.02 కోట్లు, కుభీర్ మండలానికి రూ.8.09 కోట్లు, కుం టాలకు రూ.4.81 కోట్లు, లోకేశ్వరానికి రూ.4.69 కోట్లు, ముథోల్‌కు రూ.7.61 కోట్లు, తానూర్‌కు రూ.7.28 కోట్లు, బాసరకు రూ.3.86 కోట్లు, నర్సాపూర్‌కు రూ.16 లక్షలతో ప్రతిపాదనలు పంపామని చెప్పారు. మొదటి దశలో ప్రా ధాన్యం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, టీ ఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, తోట రాము, రాజేశ్ పాల్గొన్నారు.
ఆక్యుప్రెషర్ చికిత్సను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని డాక్టర్ అసోసియేషన్‌లో లయన్స్‌క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన ఆక్యుప్రెషర్ చికిత్స శిబిరాన్ని శనివారం సందర్శించారు. వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన చికిత్సలు చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఫారూఖ్, సోలంకి భీంరావ్, తోట రాము, సంజీవ్ రెడ్డి ఉన్నారు.