దస్తురాబాద్, ఏప్రిల్ 10;రెక్కాడితే డొక్కాడాని పరిస్థితి సామాన్య ప్రజలది. కానీ, కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నది. సిలిండర్ ధర రూ.వెయ్యి దాటించేసింది. దీంతో గ్యాస్ కొనలేక కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నారు సామాన్యులు. సమీప అటవీ ప్రాంతానికి వెళ్లి, కట్టెలు తెచ్చుకొని వంట చేసుకుంటున్నా రు. గొడిసెర్యాల గోండుగూడెంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న ఈ మహిళ.., అటవి నుంచి కట్టెలు తీసుకొస్తున్న యువతులే ఇందుకు నిదర్శనం.