ఎదులాపురం, ఫ్రిబవరి 25: ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతోనే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతున్నదని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. రెండు నెలలకోసారి నిర్వహించే స్థాయీ సంఘాల సమావేశాన్ని శుక్రవారం జడ్పీ చాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ… జిల్లాలో దళిత బస్తీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతందని చెప్పారు. జిల్లా సహకార సంఘం ప్రగతిని వివరించారు. 438 సహకార సంఘాలు రిజిస్టర్ చేసుకున్నాయని, ఇందులో 335 సంఘాల్లో 75,513 సభ్యులు ఉన్నారని వివరించారు. పరస్పర సహాయక సహకార సంఘాలు 789 ఉండాగా ఇందులో 22,664 సభ్యులున్నారని తెలిపారు. జిల్లా పరిశ్రమలు, యువజన, క్రీడలు, ఉపాధి కల్పన, పౌర సరఫరాలు, ఆర్టీసీ, రవాణా శాఖల ప్రగతిని ఆయా శాఖల అధికారులు వివరించారు. సాంఘిక సంక్షేమ ఎజెండా అంశాలపై చర్చించారు. సమావేశంలో జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు తాటిపెల్లి రాజు, జడ్పీ సీఈవో గణపతి, జడ్పీటీసీలు చారులత, గణేశ్‌రెడ్డి, అరుంధతి వెంకట్‌రెడ్డి, బహ్మ్రానంద్, డీఆర్డీఏ కిషన్, డిప్యూటీ ఈసీవో రాథోడ్ రాజేశ్వర్, జిల్లా డీబీసీడీవో రాజలింగు, ఎస్సీ సంక్షేమ ఏఎస్‌డబ్ల్యూ నారాయణరెడ్డి పాల్గొన్నారు.