సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 2: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే దివార్కర్రావు కొనియాడారు. శనివారం విలేజ్నస్పూర్ ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమాన్ని మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీఈవో వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా పాఠశాల ప్రాంగణం, ఆవరణ, భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన బస్తీ-మన బడి కార్యక్రమానికి ఎంపికైన నస్పూర్ ప్రాథమిక పాఠశాలలో చేపట్టే పనులతో రూపురేఖలు మారిపోతాయన్నారు. నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పేదల కోసం అభివృద్ధి పనులు చేస్తూంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తుంటాయని, వారి తీరులో మార్పు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కమిషనర్ రాజలింగు, ఎంఈవో పోచయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, కౌన్సిలర్లు శ్రీపతి సుమతి, వంగ తిరుపతి, బోయ మల్లయ్య, మొగిలి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్‌కుమార్, దెబ్బటి రామన్న, నాయకులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, అన్నయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, జాబ్రిగౌస్, గర్శె రామస్వామి, జక్కుల రాజేశం, గర్శె భీమయ్య, జాడి భానుచందర్, పెర్క సత్తయ్య, పంబాల ఎర్రయ్య, ఇరికిళ్ల పురుషోత్తం, కొప్పర్తి రాజం, కొయ్యల కొమురయ్య, దగ్గుల మధు, చెల్ల విక్రం, కాటం రాజు, కోగిల సందీప్, వెంగల కుమారస్వామి, రామిడి మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు-మన బడితో పాఠశాలలు మరింత అభివృద్ధి ..
దండేపల్లి, ఏప్రిల్ 2: ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామంలోని మోకాసిగూడ ప్రాథమిక పాఠశాలలో శనివారం నిర్వహించిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సర్కారు మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని నిర్వహించి ఆంగ్ల భాషలో ఉత్తమ విద్యను అందించనుందన్నారు. పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, గ్రామానికి చెందిన వారు విరాళాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, సర్పంచ్ అనవేణి ప్రేమళ, ఎంపీటీసీ బోడ అమృతాబాయి, ఎంపీడీవో మల్లేశ్, ఎంఈవో విజయ్‌కుమార్, హెచ్ఎం సుజాత, విద్యా కమిటీ చైర్మన్ సంతోష్, సీఆర్పీ రాజ్ మహ్మద్,తదితరులు ఉన్నారు.
సీసీ రోడ్లు ప్రారంభం
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 2: మంచిర్యాల పట్టణంలోని నాలుగు, ఐదు వార్డుల్లో మున్సిపల్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్లను శనివారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, కౌన్సిలర్లు సుధామల్ల హరికృష్ణ, మోతె సుజాత, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, మాజీ కౌన్సిలర్ పడాల రామన్న, నాయకులు దుర్గం స్వామి, పడాల శ్రీనివాస్, ఓలం రాజ్‌కుమార్, నారాయణ, బద్రి శ్రీనివాస్, తదితరులున్నారు.