రూ.6 లక్షల ఆర్థిక సాయం
మంజూరు పత్రం అందజేసిన ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
కుభీర్, ఏప్రిల్ 1 : మండలంలోని డోడర్నతండా-1కు చెందిన గిరిజన రైతు రాథోడ్ సుధాం కు టుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. 2019 సంవత్సరం జూన్‌లో రా థోడ్ సుధాం-లక్ష్మీబా యి దంపతులు వ్యవసాయ కూలీ పనులకు వెళ్లా రు. అదే సమయంలో పిడుగుపడి సుదాం అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో లక్ష్మీబాయి తన ముగ్గురు కూతుర్లు, కుమారుడిని చదివిస్తూ కాలం వెళ్లదీస్తోంది. ఈ తరుణంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు గాను ప్రభుత్వం తరఫున రూ.6 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించారు. భైంసా పట్టణంలోని ఐబీలో స్థానిక టీఆర్ఎస్ నా యకులతో కలిసి మంజూరు పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల చదువుల కోసం ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీనిచ్చారు. వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, సింగిల్ విండో చైర్మన్, రేకుల గం గాచరణ్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, ఏఎంసీ చైర్మన్ కందుర్ సంతోష్, సంజయ్ చౌహాన్, గాడేకర్ రమేశ్, మల్లారెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.