ఇంద్రవెల్లి ఎంపీపీ పోటే శోభాబాయి
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 1 : అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని ఎంపీపీ పోటే శోభాబాయి, తహసీల్దార్ సోము పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గాంధారి అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లు లేని పేదలు ఈ నెల 11వ తేదీ వరకు తహసీల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మారుతీపటేల్డొంగ్రే, మండల కోఆప్షన్ సభ్యుడు మీర్జా జిలానీబేగ్, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్, ఆర్ఐ అరుణ్‌కుమార్, ఉపసర్పంచ్ గణేశ్టేహెరే, ఎంపీటీసీ భీంరావ్, ఈవో శంకర్, నాయకులు సుంకట్రావ్, సాయినాథ్, నాగోరావ్, భగవాన్రావ్, తదితరులు పాల్గొన్నారు.