ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 23 : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎంపీపీ శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే పేర్కొన్నారు. మండలంలోని దస్నాపూర్ గ్రామంలోని పూలాజీబాబా ధ్యాన కేంద్రానికి రూ.3లక్షలతో కంపౌండ్‌వాల్, దస్నాపూర్గూడలో రూ.10లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, సర్పంచ్ పార్వతిబాయి, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు మారుతి, తుకారాం, బాబుముండే, నగేశ్, సాయినాథ్, కేశవ్ పాల్గొన్నారు.
భీంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈజీఎస్ నిధులు రూ.6 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణానికి బుధవారం సర్పంచ్ మడావి లింబాజీ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు రాథోడ్ ఉత్తమ్, నాయకులు పాండురంగ్, పురుషోత్తం, ధరమ్‌సింగ్, డాక్టర్ జాదవ్ గణపతి పాల్గొన్నారు.