డీపీవో శ్రీనివాస్ గ్రామాల్లో నర్సరీల పరిశీలన
సిరికొండ, ఏప్రిల్ 1 : గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలని డీపీవో శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి సూచించారు. మండలంలోని పొన్న, సుంకిడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంతో పాటు పొన్న, సుంకిడి గ్రామాల్లో చలివేంద్రాలను ప్రారంభించారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీడీవో సురేశ్, ఎంపీవో అతుల్, సర్పంచ్‌లు చంద్రకళ, జాదవ్ అనిత, పంచాయతీ కార్యదర్శులు, ఉపసర్పంచ్ చిన్నరాజన్న ఉన్నారు.
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
గుడిహత్నూర్, ఏప్రిల్ 1 : గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని డీపీవో శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గ్రామ పంచాయతీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రధానవీధులను ఆయన పరిశీలించారు. చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ సునీత, ఈవోపీఆర్డీ లింగయ్య, ఉపసర్పంచ్ గజానంద్, పంచాయతీ కార్యదర్శి రాందాస్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జాదవ్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
చలివేంద్రాలు ఏర్పాటు
ఇచ్చోడ, ఏప్రిల్ 1 : మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం డీపీవో శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రానికి పనులపై వివిధ గ్రామాల ప్రజలు నిత్యం వస్తుంటారని వారి దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డి, ఎంపీటీసీలు జాహేద్, సుజాత, ఉపసర్పంచ్ లోక శిరీశ్ రెడ్డి, ఎంపీవో కొమ్ము రమేశ్, పంచాయతీ కార్యదర్శి సూర్యప్రకాశ్, సిబ్బంది పాల్గొన్నారు