ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
భైంసా, మార్చి 25 : శాంతి భద్రతల పరిరక్షణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం సబ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో మీర్జాపూర్ వద్ద సబ్ బెటాలియన్ కోసం శుక్రవారం రూ.53 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 9 ఎకరాల్లో సబ్ బెటాలియన్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇక్కడ నిత్యం 6 కంపెనీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సిబ్బంది రంగంలోకి దిగి, సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. అనంతరం ఎస్పీ ప్రవీణ్ కుమార్‌ను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, బామ్ని రాజన్న, పోతా రెడ్డి, సర్పంచ్ వినోద్, ఎంపీటీసీ రజాక్, బెటాలియన్ కమాండెంట్ వేణుగోపాల్, సీఐలు ప్రవీణ్ కుమార్, చంద్రశేఖర్, వినోద్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.