నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
రెవెన్యూ అధికారులతో సమావేశం
నిర్మల్ టౌన్, మార్చి 23 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని 27వ ప్యాకేజీ పరిధిలో భూ సేకరణ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం భూ సేకరణపై రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 27వ ప్యాకేజీ ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. కాల్వల నిర్మాణం, ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూ సేకరణ ఆయా మండలాల్లో పూర్తిచేసి నివేదికలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో రమేశ్‌రాథోడ్, ప్రత్యేక అధికారి స్రవంతి, నీటి పారుదల శాఖ అధికారి రామారావు పాల్గొన్నారు.
గడువులోగా రుణాలు అందించాలి..
జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణ ప్రణాళికను పూర్తి చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో బ్యాంకర్లు, సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో లక్ష్యాన్ని చే రుకోవాలన్నారు. ఇప్పటి వరకు మంజూరైన, అం దించిన, పెండింగ్ రుణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో విజయలక్ష్మి, లీడ్‌బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ పాల్గొన్నారు.