నిర్మల్ టౌన్, మార్చి 16 : ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సీఎం తీపికబురు అందించారు. శాసనసభా వేదికగా గౌరవ వేతనాన్ని రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3,445 మందికి లబ్ధి చేకూరు తుండగా.. కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. బుధవారం కార్మికులు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
తెలంగాణ ప్రభు త్వం సర్కారు బడుల్లోని మధ్యాహ్న భోజన కార్మికులకు తీపి కబురు అందించింది. వా రి గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో ప్ర కటించారు. ప్రస్తుతం రూ. 1000 నుంచి రూ.3 వేలకు పెంచుతామని ప్రకటించడంతో ఉ మ్మడి జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి జిల్లాలో 3445 మందికి ప్రయోజనం..
ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్, మరాఠీ, బెంగాలీ, తదితర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఉమ్మడిజిల్లాలో మొత్తం 34 45 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్న త పాఠశాలలుండగా.. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.4.79 పైసలు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ. 7.45 చొప్పున ప్రభు త్వం వారి ఖాతాల్లో జమ చేస్తోంది. దీనికితోడు గౌరవ వేతనం కింద 2016 నుంచి నెలకు రూ. వెయ్యి చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. ఆ వేతనాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడింతలు పెంచుతూ రూ. 3 వేలకు నిర్ణయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వంలోనే గౌరవమైన వేతనం లభించడంతో వారు సంబురపడుతున్నారు.
చాలా సంతోషంగా ఉంది..
మా పాఠశాలలో సుమారు 500 మంది పిల్లలు చదువుతున్నారు. మేము నలుగురం ప్రతిరోజూ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని వండి పిల్లలకు అందిస్తున్నాం. గతంలో నిర్వాహకులకు గౌరవ వేతనం రూ. వెయ్యి ఉండడంతో ఖర్చులకు ఇబ్బందులు తలెత్తేవి. నిర్వాహకుల కింద సహాయ కార్మికులుగా పని చేస్తున్న వారికి వేతనం పెంచమంటే పెంచేవారు కారు. ఇప్పుడు వారికి గౌరవ వేతనం పెరగడంతో మాకు కూడా అందులో నుంచి రూ.500 చొప్పున ఇస్తామని చెబుతున్నారు.
–పద్మ, జుమ్మెరాత్పేట్ ఉన్నత పాఠశాల నిర్వాహకురాలు
కార్మికుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి..
మాది సోన్ మండల కేంద్రం. పదేళ్ల నుంచి పిల్లలకు భోజనం వండిపెడుతున్నా. అప్పట్లో మాకు ఒక్కొక్క విద్యార్థికి రూ. 2.40 పైసల చొప్పున వచ్చేవి. తెలంగాణ వచ్చాక రూ. 7.40 పైసలకు పెంచారు. గౌరవ వేతనం కూడా రూ. వెయ్యి ఇవ్వడం వల్ల అవి వచ్చిపోయే ఖర్చులకు సరిపోయేవి కావు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మా కష్టాలను గుర్తించి వెయ్యి ఉన్న గౌరవ వేతనాన్ని రూ. 3 వేలకు పెంచినందుకు ఆనందంగా ఉన్నది.
–కొత్తకాపు గంగవ్వ, సోన్ పాఠశాల
ముఖ్యమంత్రి మాట ఇస్తే అమలు చేస్తారు…
ముఖ్యమంత్రి ఏ మాట ఇచ్చినా దాన్ని అమలు చేస్తారు. ఎన్నికలప్పుడు రూ.1000 ఉన్న పింఛన్ రూ. 2 వేలకు చేస్తామన్నారు. రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. అవి రెండు ఇప్పుడు నాకు వస్తున్నాయి. ప్రతిరోజూ భోజనం వడ్డించే కార్మికులను కూడా ఆదుకుంటారని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వెయ్యి వేతనాన్ని రూ. 2 వేలకు పెంచాలని గతంలో సీఎంను కోరినం. ఇప్పుడు రూ.3వేలకు చేసినందుకు సంతోషంగా ఉంది.
–సువర్ణ, కడ్తాల్
గౌరవ వేతనంతో బాధ్యత మరింత పెరిగింది…
మధ్యాహ్నా భోజన కార్మికులకు గౌరవ వేతనం పెంచడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. పిల్లలు బాగా తిన్నప్పుడే ఆరోగ్యంగా ఉం డి బాగా చదువుతారని సార్లు చెప్పిన్రు. మంచి కూరగాయలతో కూ డిన భోజనం వండి పిల్లలకు పెడుతున్నా. ఇచ్చేది రూ. వెయ్యి గౌ రవ వేతనమైనా పిల్లలకంటే మాకు ఎక్కువేం కాదు అనుకున్నాం. ఇప్పుడు రూ. 3 వేలకు పెంచడంతో మాపై గౌరవం మరింత పెరిగింది.
–హంసలత, మామడ ప్రాథమిక పాఠశాల
పాఠశాలలు మరింత బలోపేతం..
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. కేజీ టు పీజీ విద్య అమలులో భాగంగా గురుకులాలు, ప్రభుత్వ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీ వంటి చర్యలు చేపట్టడంతో విద్యా ప్రమాణాలు మరింత పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్నా భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ. 1000 నుంచి రూ.3 వేలకు పెంచడం గొప్ప విషయం.
–రవీందర్రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి