ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం, మార్చి 15: దళితబంధు యూనిట్ల స్థాపనకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం గా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. దళితబంధు పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొద టి విడుతలో ఎంపికైన గ్రామాల వారీగా లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. లాభసాటిగా ఉండే యూనిట్లను ఏర్పాటు చేసుకొని దళితలందరూ ఆర్థికాభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. అదిలాబాద్ నియోజకవర్గంలో 100 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. మినీ డెయిరీ, ఆటోట్రాలీ, గొర్రెలు, మేకలు, తదితర యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ముందు లబ్ధిదారులు వృత్తిలో నైపుణ్యం, అనుభవం ఉన్న వాటిని ఎం చుకునేలా ప్రోత్సహించాలన్నారు. యూనిట్ల స్థాప నలో లబ్ధిదారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పా రు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఎల్డీఎం చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి ఆశా కుమారి, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రామారావు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రాథోడ్ రాజేశ్వర్, ఏఎంవీఐ మధు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.