
భీంపూర్, జూలై 10 : గ్రామాల పచ్చదనం, పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికులే కీలకమని డీఆర్డీవో కిషన్ పేర్కొన్నారు. శనివారం ఆయన ప్రత్యేకాధికారి గోపీకృష్ణ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్నతో కలిసి పిప్పల్కోటి గ్రామాన్ని సందర్శించారు. పదిరోజుల పల్లెప్రగతి పనులను పరిశీలించి అభినందించారు. సర్పంచ్ కేమ కళ్యాణి, ఉపసర్పంచ్ దొంతుల సుభాష్, కార్యదర్శి వెంకటేశ్, పారిశుధ్య కార్మికులు హుస్సేన్, లస్మన్న, రాజు, ఇంద్రాజీని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ.. మండలంలో పల్లె ప్రగతిలో పిప్పల్కోటి ఆదర్శంగా ఉందన్నారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రతి కుటుంబం కంకణబద్ధులు కావాలని పేర్కొన్నారు. పల్లెప్రగతి ముగింపు గ్రామసభలో సూచనలు చేశారు. అధికారులతో జీపీ పాలకవర్గం సభ్యులు, ఏపీవో సంగీత, గ్రామస్తులు ఉన్నారు.
బృహత్ ప్రకృతివనం కోసం స్థల పరిశీలన..
భీంపూర్ మండలం పిప్పల్కోటిలో బృహత్ ప్రకృతివనం ఏర్పాటుకోసం అవసరమైన స్థలాన్ని డీఆర్డీవో కిషన్ పరిశీలించారు. మండలానికి ఒకటే ఉండే ఈ వనంకోసం దాదాపుగా 10 ఎకరాల మేర భూమి అవసరమని , కామట్వాడలో కూడా స్థలం చూస్తామని ఈ సందర్భంగా డీఆర్డీవో పేర్కొన్నారు. ఆయనతో ప్రత్యేకాధికారి గోపీకృష్ణ, సర్పంచ్ కేమ కళ్యాణి ఉన్నారు.