ఉట్నూర్, మార్చి14: గిరిజన ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇస్తున్నట్లు పీవో అంకిత్ తెలిపారు. సోమవారం స్థానిక పీవో క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న నోటిఫికేషన్లకు గిరిజన యువతను పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా నిపుణులతో కూడిన అధ్యాపక బృందంతో టెట్, కానిస్టేబుల్, ఎఫ్బీవో, గ్రూప్-2, 3, 4 పోస్టులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్, ఆదిలాబాద్, ఇచ్చోడ, బెల్లంపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్లలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నమన్నారు. ఇందుకు గాను అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల ఉట్నూర్లో 21న, ఆదిలాబాద్ లో 23న అర్హత పరీక్షను నిర్వహిస్తామన్నారు. శిక్షణకు ఎంపికైన వారిని ఈనెల 26న ప్రకటిస్తామన్నారు. వచ్చేనెల మొదటి రోజు నుండి శిక్షణ ప్రారంభిస్తామన్నారు. కావున నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.