ఆధునికీకరణ పనులకు రూ.69లక్షలు
దవాఖానలో రక్తనిధి ఏర్పాటు
టీబీ నిర్ధారణకు ట్రూనాట్ మిషన్
బోథ్, మార్చి 13 : బోథ్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రం దవాఖానకు మహర్దశ పట్టనుం ది. ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం రూ.69 లక్షలు మంజూరు చేసింది. వైద్య విధాన పరిషత్ ఆధీనంలోకి వెళ్లడంతో 30 పడకలతో రోగులకు మెరుగైన సేవలు అందించనుంది. దవాఖానను ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. వైద్య విధాన పరిష త్ ఆధీనంలోకి వెళ్లడంతో జనరల్ సర్జన్, గైనకా లజిస్ట్, జనరల్ ఫిజిషియన్, పీడియాట్రిక్ వైద్యు లు రానున్నారు. ప్రత్యేక వైద్య నిపుణలతో రోగు లు రిమ్స్, నిమ్స్‌కు వెళ్లకుండా ఇక్కడే చికిత్స తీసుకునే అవకాశం కలుగనుంది. అప్‌గ్రేడ్‌తో అవసరమైన పరికరాలు, పరీక్షల సామగ్రి అందు బాటులోకి రానుంది. మరోవైపు ఆధునీకీకరణ పనులకు మంజూరైన రూ.69 లక్షల నుంచి రూ. 43 లక్షలు పోస్టుమార్టం గది నిర్మాణంతో పాటు అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడేందుకు వీలుగా రూ. 10 లక్షలతో రక్తనిధి (బ్లడ్ బ్యాంక్) ఏర్పాటు చేయనున్నారు. టీబీ నిర్ధారణకు అవస రమైన ట్రూనాట్ మిషన్ కోసం రూ. 16 లక్షలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణాలతో పాటు ఏర్పాట్లు పూర్తయితే ఆత్యాధునిక వైద్య సేవలు బోథ్ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
కొత్త భవనం కోసం రూ.10 కోట్లు
నిజాం కాలంలో నిర్మించిన పాత భవనంలోనే కొనసాగుతున్న బోథ్ సీహెచ్‌సీ కొత్త భవనం కోసం రూ. 10 కోట్లు మంజూరు చేస్తామని ఇటీవల జిల్లాకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. త్వరలో నే నిధులు రానుండడంతో కొత్త భవనం అందుబాటులోకి రానుం ది. వైద్య విధాన పరిషత్ ఆధీనం లోని వెళ్లడంతో కొత్తగా వచ్చే వైద్యులు రోగులను పరీక్షించడం తో పాటు నిర్ధారణ పరీక్షలు చేయ డానికి అవసరమైన ల్యాబోరేటరీ లు కొత్త భవన నిర్మాణంతో అందు బాటులోకి రానుంది. గత సీమాంధ్ర పాల కులు బోథ్ దవాఖానను పట్టించుకోక పోవడంతో అరకొర వసతులతో రోగులకు చికిత్స అందించే పరిస్థితు లు ఉండేవి. ప్రస్తుతం ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూ రు చేయడంతో ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సేవలు మెరుగుపడుతాయి..
బోథ్ సీహెచ్‌సీ వైద్య విధాన పరిషత్ ఆధీనంలోకి వెళ్లడంతో రోగులకు సేవలు మె రుగవుతాయి. నిష్ణా తులైన వైద్యులతో మహిళలు, పిల్లలకు మరిన్ని సేవలు అందు తాయి. అన్ని రకాల పరికరాలు అందు బాటు లోకి రావడంతో ఇక్కడికక్కడే రోగ నిర్ధారణ పరీ క్షలు చేసి చికిత్స అందించే వీలు కలుగుతుంది.
– ఆర్ రవీంద్రప్రసాద్, సూపరింటెండెంట్, బోథ్ సీహెచ్‌సీ